ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. శనివారం కోర్టుకు ఈడీ చార్జ్‌షీట్ సమర్పించింది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. శనివారం కోర్టుకు ఈడీ చార్జ్‌షీట్ సమర్పించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ అంశాలపై ఈడీ విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. ఇందులో దాదాపు 3,000 పేజీలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. మహేంద్రుడి అరెస్టు తర్వాత 60 రోజుల చట్టబద్ధమైన గడువు నేటితో ముగుస్తున్నందున వ్యాపారవేత్త సమీర్ మహేంద్రుపై చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టుగా ఈడీ తెలిపింది. అయితే ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన తొలి చార్జ్‌షీట్ ఇదే. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఈడీ సెప్టెంబర్ 27న ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసింది. ఇక, ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులపై త్వరలో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కూడా కోర్టుకు ఈడీ తెలియజేసింది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం తొలి చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అయితే ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా పేరును మాత్రం సీబీఐ చార్జ్‌షీటులో పేర్కొన్నలేదు. అయితే మనీస్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లి సహా ఏడుగురుని నిందితులుగా సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది.