Economic Survey 2022: పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు సోమ‌వారం ప్రారంభం అయ్యాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session) ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం రెండున్నరేండ్లు ఎక్కువగా ఉన్నదని ఆర్థిక సర్వే పేర్కొంది.  

Economic Survey 2022: పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు సోమ‌వారం ప్రారంభం అయ్యాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget session) ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman-Union Minister for Finance and Corporate Affairs) ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం రెండున్నరేండ్లు ఎక్కువగా ఉన్నదని ఆర్థిక సర్వే పేర్కొంది. Economic Survey 2022 .. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల ఆర్థిక పరిస్థితులను వివరించడంతో పాటుగా, భవిష్యత్తులో వృద్దిని వేగవంతం చేయడానికి అవసరమైన సంస్కరణల వివరాలను, స‌మాజిక అంశాల‌ను కూడా పేర్కొంటుంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక స‌ర్వేలో అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. అందులో దేశ ప్ర‌జ‌ల ఆయుర్ధాయం కూడా ఉంది. 

ఆర్థిక సర్వే (Economic Survey 2022) లో ప్రస్తావించిన వివ‌రాల ప్ర‌కారం.. భారతీయ మహిళలు పురుషుల కంటే రెండున్న‌రేండ్లు అధిక ఆయుర్థాయం పెరిగింద‌ని పేర్కొంది. శాంపిల్ రిజిస్ట్రేష‌న్ బెస్డ్ సిస్ట‌మ్ (ఎస్ఆర్ఎస్‌)-2014-2018 న‌మూనా ఆధారంగా.. స‌గ‌టు జీవిత కాలాన్ని అంచ‌నా వేశారు. ఈ వివ‌రాల ప్ర‌కారం.. పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌ల జీవిత కాలం పెరిగింది. స్త్రీల ఆయుర్దాయం 70.7 సంవత్సరాలు కాగా పురుషుల ఆయుర్దాయం 68.2 ఏండ్లుగా ఉంది. అంటే పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం రెండున్నరేండ్లు ఎక్కువగా ఉన్నదని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2013-17తో పోల్చితే 2014-18 మధ్యకాలంలో భారతీయుల సగటు ఆయుర్దాయం దాదాపు 5 నెలలు పెరిగింద‌ని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో (urban areas) ప్రజల సగటు ఆయుర్దాయం 72.6 ఏండ్లుగా ఉంది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల స‌గ‌టు ఆయుర్దాయం 68 సంవ‌త్స‌రాలుగా ఉంది. 

అయితే, దేశంలోని చాలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆడ‌వారి ఆయుర్ధాయం అధికంగా ఉంద‌నీ, వీరు ఎక్కువ కాలం జీవించ‌గ‌ల‌ర‌ని ఆర్థిక సర్వే (Economic Survey 2022) పేర్కొంది. చాలా రాష్ట్రాల్లో ఇదే ప‌రిస్థితి ఉంద‌ని తెలిపింది. అయితే, దేశంలోనే పేద రాష్ట్రాలుగా ఉన్న బీహార్, జార్ఖండ్ ల‌లో మాత్రం ఇలాంటి ప‌రిస్థితులు లేవ‌ని తెలిపింది. అంతేకాకుండా, 2014-18 మధ్య కాలంలో పుట్టినప్పుడు 69.4 సంవత్సరాలుగా ఉన్న ఆయుర్దాయం 2013-17 నుండి 0.4 సంవత్సరాలు పెరిగింది. "ఇది రాష్ట్రాలలో విస్తృతంగా మారుతూ ఉంటుంది. చత్తీస్‌గఢ్‌లో అత్యల్పంగా 65.2 సంవత్సరాల నుండి కేరళ, ఢిల్లీలో అత్యధికంగా 75.3 సంవత్సరాల ఆయుర్ధాయం క‌లిగి ఉన్నారు. ఇది గ్రామీణ ప్రాంతాలలో (68.0 సంవత్సరాలు) కంటే పట్టణ ప్రాంతాలలో (urban areas) (72.6 సంవత్సరాలు) ఎక్కువ" అని ఆర్థిక సర్వే (Economic Survey 2022) పేర్కొంది. 

1970-75 నుండి 2014-18 వరకు గ్రామీణ, పట్టణ జీవన కాలపు అంచనాల మధ్య అంతరం కూడా గణనీయంగా తగ్గిందని ఆర్థిక సర్వే (Economic Survey 2022) పేర్కొంది. 2013-17 నుండి ఆయుర్దాయం పెరుగుదల గ్రామీణ ప్రాంతాలలో (0.3 సంవత్సరాలు) పట్టణ ప్రాంతాల (0.2 సంవత్సరాలు) కంటే ఎక్కువగా ఉంది.