ఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన దాడులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా పరిగణించింది. పరస్పరం దాడులు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే దేశంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఆర్టికల్ 324ను ప్రయోగించింది. 

బెంగాల్ లో ఒకరోజు ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. వాస్తవానికి ఈనెల 17 సాయంత్రం 5 గంటలకు పశ్చిమబెంగాల్ లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అయితే దాడులు జరిగిన నేపథ్యంలో ఒకరోజు ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. 

అంటే గురువారం రాత్రి 10 గంటలకు ఎన్నికల ప్రచారం ముగించాలని ఆదేశించింది. వాస్తవానికి 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం నిలిపివేస్తారు. కానీ అంతకు ముందు రోజే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలంటూ ఈసీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే సిఈసీ నిర్ణయంపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.