పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల కమీషన్ ప్రకటించింది. మొత్తం మీద 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ఆదివారం ప్రకటించింది. 

అంతకుముందు ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించకపోవడంపై సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. పోలింగ్ ముగిసి గంటలు ముగుస్తున్నా ఓటింగ్ శాతాన్ని ఎందుకు ప్రకటించలేదని ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. 

Also Read:ఎగ్జిట్ పోల్ ఫలితాలు: కేజ్రీవాల్ కి మరోసారి పట్టం కట్టిన ఢిల్లీ

ఢిల్లీ శాసనసభకు శనివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి. ఢిల్లీలో మొత్తం 13,571 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. లక్షా 24 మంది పోలింగ్ విధులు నిర్వహిచారు.

Also Read:ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్: తగ్గిన ఓటింగ్ శాతం

ఢిల్లీలో మొత్తం ఓటర్లు 1,47,86,382 మంది ఉండగా అందులో మహిళలు 66 లక్షల 80 వేల 277 మంది, పురుషులు 81 వేల 5 వేల 236 మంది ఉన్నారు. 2015 ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. బిజెపి 3 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెసు పార్టీ ఖాతానే తెరవలేదు.