భూకంపాలతో అండమాన్‌ నికోబార్‌ దీవులు (Andaman-Nicobar Islands) వణికిపోతున్నాయి. ఆదివారం రాత్రి భూ ప్రకంపణలు చోటుచేసుకుంటున్నాయి.

అండమాన్-నికోబార్‌ (Andaman-Nicobar Islands)లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. ప్రస్తుతం ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రాత్రి 7.39 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం కాంప్‌బెల్ బేలో భూమికి 70 కిలోమీటర్ల దిగువన ఉంది. రాత్రివేళ భూమి కంపించడంతో స్థానిక ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు అధికారులు వెల్లడించారు.