మహారాష్ట్రలోని నాసిక్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై  3.9 గా నమోదయ్యింది. శనివారం రాత్రి సుమారు 11.41 గంటల సమయంలో భూమి కంపించ‌డంతో ప్రజలు భయంతో ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని  తెలుస్తోంది 

మహారాష్ట్రలోని నాసిక్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.9 గా నమోదయ్యింది. శనివారం రాత్రి సుమారు 11.41 గంటల సమయంలో భూకంపం సంభవించింద‌ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. ఈ ఘ‌ట‌న‌తో ప్రజలు భయంతో ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌ఎస్‌సి) సమాచారం ప్ర‌కారం.. నాసిక్‌కు పశ్చిమాన 88 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించగా, దాని లోతు 10 కి.మీ ఉన్న‌ట్టు గుర్తించింది. అంతేకాకుండా, మణిపూర్‌లోని ఇంఫాల్‌కు పశ్చిమ-వాయువ్యంగా భూకంపం సంభ‌వించిన‌ట్టు , రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ తెలిపింది.

Read Also: తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. జనవరి 2 వరకు ఆంక్షలు, హద్దు మీరితే

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా.. ఈ భూకంపం ప్రభావం చుట్టుపక్కల రాష్ట్రాలపైనా కనిపించిందని.. పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

గత నెలలో మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో స్వల్ప భూకంపం సంభ‌వించింది. అప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. పాల్ఘర్ జిల్లాలో 2.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత నెల 26న పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.1గా నమోదయ్యింది.