నికోబార్ దీవుల్లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం సంభవించిన ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.
నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.0గా నమోదు అయ్యింది. సోమవారం ఉదయం 5:07 గంటలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సోమవారం తెలిపింది. అయితే దీని వల్ల ఆస్తి,ప్రాణ నష్టమూ జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ సీఎస్) వివరాల ప్రకారం.. భూకంపం నికోబార్ దీవుల ప్రాంతంలో 10 కిలో మీటర్ల లోతులో ఉంది. కాగా.. జనవరిలో అండమాన్ సముద్రం సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 77 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు నమోదైనట్టు ఎన్సీఎస్ తెలిపింది. గత ఏడాది అండమాన్ నికోబార్ దీవుల్లో 24 గంటల వ్యవధిలో 3.8 నుంచి 5.0 తీవ్రతతో 22 సార్లు భూకంపం సంభవించింది.
గత ఆదివారం తెల్లవారుజామున ఉత్తరకాశీలో 2.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని, తరువాత రెండు వరుస ప్రకంపనలు సంభవించాయని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. అర్ధరాత్రి 12.45 గంటలకు సంభవించిన మొదటి భూకంపం కేంద్రం జిల్లాలోని భట్వారీ ప్రాంతంలోని సిరోర్ అటవీప్రాంతంలో ఉంది.
జమ్మూ కాశ్మీర్ లోని బందిపొర జిల్లాలో కూడా ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.9గా నమోదు అయ్యింది. ఉదయం 6.57 గంటలకు ఒక్క సారిగా భూమి కంపించిందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 34.42 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 74.88 డిగ్రీల తూర్పు రేఖాంశంతో భూమి క్రస్ట్ లోపల 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ఏషియానెట్ న్యూస్‌పై ఎస్‌ఎఫ్‌ఐ దాడిని, పోలీసుల సోదాలను సమర్ధించిన సీఎం విజయన్..
అంతకు ముందు జనవరి 19వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.2గా నమోదు అయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో మధ్యాహ్నం 12:04 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం భూమికి 10 కిలో మీటర్ల లోతులో ఉందని, రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రతతో నమోదైందని పేర్కొంది.
