Asianet News TeluguAsianet News Telugu

Mizoram Earthquake: మిజోరాంలో భూకంపం, కోల్ కతాలో సైతం ప్రకంపనలు

మిజోరాంలో శుక్రవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద 5.3గా నమోదైంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Earthquake in Mozoram: Tremors felt in Kolkata also
Author
Mizoram, First Published Nov 26, 2021, 8:25 AM IST

న్యూఢిల్లీ: భారత ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో భూకంపం సభవించింది. శుక్రవారం తెల్లవారు జామున 5.15 గంటలకు మిజోరాంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ మీద Eartquake తీవ్రత 6.1గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ సీస్మోలజీ (ఎన్ సీఎస్) తెలియజేసింది. థెంజాల్ కు 73 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని ఎన్ సీఎస్ తెలిపింది. భూకంపం వల్ల సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి తెలియరాలేదు. 

భారత్ - మయన్మార్ సరిహద్దులో భూమి కంపించిందని యూరోపియన్ - మెడిటేరియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. శుక్రవారం తెల్లవారు జామున త్రిపుర, మణిపూర్, Mizoram, అసోంలతో పాటు కోల్ కతాలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.3గా నమోదైందని తెలిపింది. 

భూకంప కేంద్రం బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కు 183 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. తెల్లవారు జామున 5.53 గంటలకు మరోసారి భూకంపం సభవించింది. ఇంత దీర్ఘమైన భూకంపం ఇంతకు ముందు తాము చూడలేదని స్థానికులు అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios