లడఖ్ లో భూకంపం సంభవించింది. (Earthquake in Ladakh) మంగళవారం ఉదయం 5.39 గంటలకు లేహ్ ప్రాంతంలో ఒక్క సారిగా ప్రకంపనలు (Earthquake in Leh) సంభవించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Earthquake in Ladakh : లడఖ్ లోని లేహ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఒక్క సారిగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.4గా నమోదు అయ్యింది. 5.39 గంటలకు ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

అయోధ్యకు వెళ్లి వచ్చినందుకు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ కు పత్వా, ప్రాణహాని..

ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్ట్ పెట్టింది. ‘‘భారత కాలమానం ప్రకారం 05.39.56 సమయంలో లడఖ్ లోని లేహ్ లో 3.4 తీవ్రతతో భూకంపం సంభించింది. లాట్: 35.27, పొడవు: 75.40 గా ఉంది.’’ అని పేర్కొంది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో ఉందని, 35.27 అక్షాంశాలు, 75.40 రేఖాంశాల వద్ద సంభవించిందని తెలిపింది.

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలోనూ శనివారం భూకంపం సంభవించింది. జిల్లాలోని న్యాల్ కల్, ముంగితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. ఏ జరుగుతుందో తెలియక భయపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలకు సంబంధించి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు.. మీ జిల్లాకు ఎవరొచ్చారో తెలుసా ?

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.