Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఉత్తర భారతదేశంలో పలు చోట్ల ప్రకంపనలు

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని కలాఫ్గన్‌కు 90 కి.మీ దూరంలో ఉన్నట్లు భావిస్తున్నారు.

earthquake in delhi ncr today-strong tremors felt
Author
First Published Mar 21, 2023, 10:42 PM IST

ఢిల్లీ NCR భూకంపం: ఢిల్లీ-NCR, హర్యానా, రాజస్థాన్ సహా దాదాపు  ఉత్తర భారతదేశంలో మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు సంభవించాయి.భవనాలు కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రజలు రాత్రి భోజనం తర్వాత నిద్రించడానికి సిద్ధమవుతున్నప్పుడు తరుణంలో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో భయానక భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చాలా మంది వీధులు, పార్కుల వైపు పరుగులు తీశారు. ప్రస్తుతం ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

అయితే, ఢిల్లీ, ఇస్లామాబాద్,కాబూల్‌లో ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు జరిగినట్లు సమాచారం లేదు.  భారతదేశంలో భూకంపం యొక్క గరిష్ట ప్రభావం జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానాతో సహా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఉంది. భూకంప కేంద్రాన్ని ఆఫ్ఘనిస్థాన్‌గా పేర్కొంటున్నారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, తజికిస్థాన్, చైనాలో కూడా భూకంపం సంభవించింది. ఉదయం 10.17 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

ఇతర నివేదికల ప్రకారం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలో బలమైన భూకంపం సంభవించింది. నివేదికల ప్రకారం, తుర్క్‌మెనిస్తాన్, ఇండియా, కజకిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ , కిర్గిజ్‌స్థాన్‌తో సహా రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని కలాఫ్గన్‌కు 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు భావిస్తున్నారు. ఢిల్లీలో భూమి కంపించడం ఈ నెలలో ఇది మూడోసారి కావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

మంగళవారం సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించిన తర్వాత మంగళవారం అర్థరాత్రి అనేక సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు సంభవించినట్టు సమాచారం. సోషల్ మీడియాలో  ప్రజలు వీధుల్లో గుమిగూడినట్లు, ప్రజలు తమ ఇళ్లలో పడిపోతున్న వస్తువులను చూపిస్తున్న వీడియో షేర్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios