New Delhi: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రతతో నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. శనివారం మధ్యాహ్నం 2:39 గంటలకు సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.
Earthquake Strikes Bay of Bengal: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రతతో నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. శనివారం మధ్యాహ్నం 2:39 గంటలకు సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.
వివరాల్లోకెళ్తే.. శనివారం మధ్యాహ్నం బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. ఎన్సీఎస్ ప్రకారం, భూకంపం శనివారం మధ్యాహ్నం 2:39 గంటలకు, సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. "భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైంది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదని సంబంధిత అధికారులు తెలిపారు.
అంతకుముందు, జమ్మూకాశ్మీర్ లో కూడా భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు వచ్చాయి. గుల్ మార్గ్ లో శనివారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.2గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్ సీఎస్ ) తెలిపింది. ఉదయం 8:36 గంటలకు 129 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. 35.46 అక్షాంశం, 73.32 రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. ‘‘05.08.2023 రోజున భారత కాలమానం ప్రకారం 08.36 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంప లోతు 129 కిలోమీటర్లుగా ఉంది. ’’ అని ఎన్సీఎస్ ట్వీట్ చేసింది. అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం గానీ, వస్తు నష్టం గానీ జరిగినట్లు సమాచారం లేదు.
