48 గంటల్లో రెండో సారి అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.8 తీవ్రత నమోదు..
వరుసగా రెండో రోజు రెండో సారి అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్క సారిగా ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.8 గా నమోదైంది.

అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం మరోసారి భూకంపం వచ్చింది. ఈ ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు వివరాలు వెల్లడించలేదు.
యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించే బిల్లుకు కేరళ అసెంబ్లీ ఆమోదం..
అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం మధ్యాహ్నం 2:09 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం భూమి ఉపరితలం నుండి 59 కి.మీ దిగువన ఉంది. ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని ఎన్‌సీఎస్ తన ట్వీట్‌లో పేర్కొంది. అంతకు ముందు సోమవారం కూడా ఇదే తరహాలో భూకంపం సంభవించింది. అండమాన్ సముద్రంలో దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12.48 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని వల్ల 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి. ఇదిలా ఉండగా.. మన దేశానికి దిగువ భాగంలో ఉన్న శ్రీలంక రాజధాని కొలంబోలో గత ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం యొక్క లోతు భూమికి 10 కి.మీ.ఉందని తెలిపింది. గతేడాది కూడా సరిగ్గా ఇదే నెలలో (డిసెంబర్ 29, 2021) కొలోంబోలో భూకంపం వచ్చింది. ఆ సమయంలో కూడా దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.
అంతకుముందు శనివారం ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రాంతంలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఈ దేశంలో తరుచు భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. అయితే ఇటీవల ఇండోనేషియాలో సంభవించిన భూకంపం వల్ల కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగలేదు.
సుప్రీం కోర్టులో బిల్కిస్ బానో పిటిషన్.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేల ఎం త్రివేది..
భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీనినే భూకంపం అని అంటారు.