Earthquake: జార్ఖండ్, అసోంలలో వెంటవెంటనే భూకంపాలు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగెత్తిన జనం
జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో ఈ రోజు మధ్యాహ్నం వెంటవెంటనే భూకంపాలు సంభవించాయి. జార్ఖండ్‌లో మధ్యాహ్నం 2.22 గంటల ప్రాంతంలో, అసోంలో 2.40 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. ఈ భూకంపాల తీవ్రతలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.
గువహతి: జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కొద్ది వ్యవధి తేడాతో భూకంపం సంభవించింది. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. ఇండ్లల్లో నుంచి బయటకు వచ్చి బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడారు. తొలుత జార్ఖండ్‌లోని సింగ్‌భమ్‌లో మధ్యాహ్నం 2.22 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం ప్రకంపనలు పది కిలోమీటర్ల లోతు కనిపించాయని వివరించింది.
అనంతరం కొద్ది సేపటికే ఈశాన్య రాష్ట్రంలో అసోంలోనూ ఇదే కలకలం రేగింది. సోనిత్‌పూర్‌లో మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భమిలో 5 కిలోమీటర్ల వరకు భూమి కంపించిందని వివరించింది. బుధవారం కూడా అసోంలో భూమి కంపించిన సంగతి తెలిసిందే. అసోంలోని తేజ్‌పూర్‌లో బుధవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రత నమోదుచేసింది.
ఈ రోజు మధ్యాహ్నం జార్ఖండ్, అసోంలో సంభవించిన భూకంపాలు స్వల్పతీవ్రత కలిగినవేనని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలనీ వెల్లడించింది. ఇప్పటివరకు ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించలేదు.