జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ భూకంపం సంభవించింది. కొండ ప్రాంతమైన రాంబన్ జిల్లాలో వచ్చిన ఈ భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.0గా నమోదు అయ్యింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదు.
జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ భూకంపం వచ్చింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న కొండ ప్రాంతమైన రాంబన్ జిల్లాలో భూమి ఒక్క సారిగా కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.0గా నమోదు అయ్యింది. అయితే భూకంప లోతు ఉపరితలానికి ఐదు కిలోమీటర్ల లోతులో 33.31 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.19 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉందని అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ లో చేరడం కంటే బావిలో దూకడం మంచిది - బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..
కాగా.. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరిగినట్టు ఇప్పటి వరకు సమాచారం లేదు. కాగా.. ఒకే వారంలో జమ్మూకాశ్మీర్ లో నాలుగు సార్లు భూమి కంపించడం ఆందోళన కలిగిస్తోంది. గత బుధవారం తెల్లవారుజామున కూడా జమ్మూ కాశ్మీర్ లోని కత్రా, దోడా ప్రాంతాల్లో వరుసగా 4.3, 2.8 తీవ్రతతో రెండు భూకంపాలు వచ్చాయి. దీంతో ఒక్క సారిగా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కత్రాలో తెల్లవారుజామున 2.20 గంటలకు భూప్రకంపనలు సంభవించాయని, కత్రాకు ఈశాన్యంగా 81 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.
Earthquake of Magnitude:3.0, Occurred on 17-06-2023, 14:03:54 IST, Lat: 33.31 & Long: 75.19, Depth: 5 Km ,Location: Ramban, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/fqMzKX7ykZ@Indiametdept@ndmaindia@KirenRijiju@Dr_Mishra1966pic.twitter.com/HrSmExnaIp
— National Center for Seismology (@NCS_Earthquake) June 17, 2023
అలాగే రియాసి జిల్లాలోని కత్రాకు తూర్పున 74 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 2.43 గంటలకు భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. భూకంప కేంద్రం ఐదు కిలోమీటర్ల లోతులో ఉంది. అయితే వీటి వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.
గుజరాత్ దర్గా వివాదం.. జునాగఢ్ లో ఆక్రమణల తొలగింపు వద్దంటూ పోలీసులపైకి రాళ్లు.. పౌరుడు మృతి
దోడా జిల్లాలో అంతకు ముందు రోజు అంటే మంగళవారం 5.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన మరుసటి రోజే ఈ రెండు భూకంపాలు సంభవించాయి. మంగళవారం సంభవించిన భూప్రకంపనలకు జంట పర్వత జిల్లాలైన దోడా, కిష్త్వార్ లలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరు పాఠశాల పిల్లలతో సహా ఐదుగురికి గాయాలు కాగా, ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలను అధికారులు మూసివేశారు. జమ్ముకాశ్మీర్ ప్రాంతంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ భూకంపం సంభవించింది.
