Asianet News TeluguAsianet News Telugu

earthqauke: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. జమ్ము కశ్మీర్‌లో ప్రకంపనలు

ఆఫ్ఘనిస్తాన్‌లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు జమ్ము కశ్మీర్‌లోనూ కనిపించాయి. జమ్ము కశ్మీర్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు వివరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందు కుష్‌లో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపారు. శుక్రవారం రాత్రి 9.43 గంటలకు ఈ భూకంపం వచ్చినట్టు వివరించారు. ఈ భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు రిపోర్టులు రాలేవు.
 

earthqauke hits jammu kashmir on friday night
Author
Srinagar, First Published Jan 15, 2022, 3:06 AM IST

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)లో భూకంపం(Earthquake) సంభవించింది. దాని ప్రకంపనలు జమ్ము కశ్మీర్‌(Jammu Kashmir)లో కనిపించాయి. అధికారుల వివరాల ప్రకారం, జమ్ము కశ్మీర్‌లో శుక్రవారం రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రత(Magnitude)తో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందు కుష్‌లో ఉన్నదని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 9.43 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించిందని వివరించారు. 81 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉన్నదని తెలిపారు. అయితే, ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు వెల్లడించలేదు.

దీపావళి పండుగ రోజున దేశంలో వరుస భూకంపాలు సంభవించాయి. ఈశాన్య  రాష్ట్రాలు అసోం, మణిపూర్ సహా హిమాచల్ ప్రదేశ్‌లో ఈ రోజు భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు ఉదయం భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.

ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం ఉదయం భూమి రెండు సార్లు కంపించింది. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.5గా నమోదైంది. మరోసారి ఉదయం 7.15 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.4గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్‌సీఎస్) పేర్కొంది. 

కాగా, అసోంలో ఉదయం 10.19 గంటల ప్రాంతంలో 3.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అసోం రాజధాని గువహతి సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సోనిత్‌పూర్ జిల్లా తేజ్‌పూర్ పట్టణానికి దక్షిణాన 35 కిలోమీటర్ల దగ్గర 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఇప్పటి వరకైతే ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్టు రిపోర్టులు రాలేవు.

మణిపూర్‌లోనూ భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారని అధికారులు తెలిపారు. మొయిరాంగ్ సమీపంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ఎన్‌సీఎస్ వెల్లడించింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

గత నెల 3వ తేదీన జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో భూకంపాలు కలకలం రేపాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కొద్ది వ్యవధి తేడాతో భూకంపం సంభవించింది. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. ఇండ్లల్లో నుంచి బయటకు వచ్చి బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడారు. తొలుత జార్ఖండ్‌లోని సింగ్‌భమ్‌లో మధ్యాహ్నం 2.22 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం ప్రకంపనలు పది కిలోమీటర్ల లోతు కనిపించాయని వివరించింది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో అక్టోబర్ చివరలో భూకంపం సంభవించింది.  జగిత్యాల, మంచిర్యాల జిల్లాలతో  పాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూకంపం సంభవించింది.. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

తెలంగాణ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇవాళ భూకంపం సంబవించింది. ప్రాథమిక సమాచారం మేరకు భూమి లోపల 77 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరోపియన్ మెడిటరేయన్ సిస్మోలాజికల్ సెంటర్ నివేదిక ప్రకారంగా భూకంప తీవ్రత 4.3 గా నమోదైంది.

Follow Us:
Download App:
  • android
  • ios