Asianet News TeluguAsianet News Telugu

Heavy Rains : పొంగిపొర్లుతున్న పంబా నది.. శబరిమల యాత్రకు బ్రేక్..అదేశాలు జారీ...

పతనంథిట్ట జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా పంబా నదిలో నీటి ఉధృతి పెరిగింది. దీంతో కక్కి-అనథోడ్ రిజర్వాయర్, పంబా డ్యామ్ లో వరద ప్రమాదకర స్థాయికి చేరడంతో  గేట్లు తెరిచి  దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రత దృష్ట్యా పంబ, శబరిమల యాత్రను శనివారం నిలిపివేస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.  

due to heavy rains today sabarimala pilgrimage suspended says authorities
Author
Hyderabad, First Published Nov 20, 2021, 11:42 AM IST

తిరువనంతపురం :  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని సీమ జిల్లాలతోపాటు తమిళనాడు, కేరళ లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న rains జల ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వర్షాల కారణంగా 
Kerala లోని Pamba River ఉప్పొంగి ప్రవహిస్తోంది.  దీంతో పవిత్ర శబరిమల యాత్రను అధికారులు నిలిపివేశారు.

‘పతనంథిట్ట జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కారణంగా పంబా నదిలో నీటి ఉధృతి పెరిగింది. దీంతో కక్కి-అనథోడ్ రిజర్వాయర్, పంబా డ్యామ్ లో Flood ప్రమాదకర స్థాయికి చేరడంతో  గేట్లు తెరిచి  దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రత దృష్ట్యా పంబ, Sabarimala Yatraను శనివారం నిలిపివేస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.  వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భక్తులు యాత్రను చేపట్టొద్దని అధికారులు అభ్యర్థిస్తున్నారు.

ఏపీలో భారీ వర్షాలు: చెయ్యేరు నది ఉధృతి, 12 మంది మృతదేహల వెలికితీత

చెన్నైలోనూ వర్షాలు…
తమిళనాడు రాష్ట్రం పైనా‘ అల్పపీడన ప్రభావం విపరీతంగా ఉంది. వెల్లూరు,  తిరువల్లూరు,  ఎన్నూర్  జిల్లాలో  భారీ వర్షాల కారణంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.   చెన్నైలోనూ నవంబర్ 23 వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.  కర్ణాటకలో  తీర ప్రాంతాలకు ఆరెంజ్  అలర్ట్ జారీ చేశారు.

ఇదిలా ఉండగా కర్నాటక లోనూ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాల మైసూరులోని ప్రతిష్టాత్మక ఆలయం కలిగిన Chamundeshwari Devi కొండలమీద గురువారం భూమి మరోసారి కుంగిపోయింది. నెల రోజుల వ్యవధిలో భూమి కుంగిపోవడం ఇది నాలుగోసారి. చాముండి కొండల్లోని నంది మార్గంలో గురువారం తెల్లవారు జామున రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. 

సుమారు నెలరోజులుగా వర్షాలు కురుస్తున్నందున కొండ ప్రాంతం నుంచి నీరు భారీగా పారుతోంది. దీంతో ఎక్కడ పడితే అక్కడ భూమి కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి వర్షాలు చాలా విస్తారంగా కురుస్తున్నాయి. 

Tirupati Floods: వర్షం పోయి పొగమంచు వచ్చే.. తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత

నవంబర్ ప్రారంభం నుంచి ఏ మాత్రం ఎడతెరిపి లేకుండా rain హోరెత్తిస్తోంది. మరో నాలుగైదు రోజుల పాటు వర్సాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో Mysore ప్రాంత వాసులు బెంబేలెత్తుతున్నారు. ఏకంగా 70 అడుగుల మేరన ప్రాంతం రోడ్డుకు అడ్డంగా ఉండే గోడ దాదాపుగా కుంగి పోయింది.

ప్రజాపనులు శాఖామంత్రి సీసీ పాటిల్ జియోట్రయల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చాముండి కొండలను పరిశీలించి నిర్మాణాలు చేపట్టదలచారు. ఓ వైపు నిర్మాణాలు జరపాలని భావిస్తున్నా వరుసగా వర్సాలు కురుస్తుండటంతో సమస్యగా మారింది. రోడ్డు కుంగిపోయిన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios