Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో భారీ వర్షాలు: చెయ్యేరు నది ఉధృతి, 12 మంది మృతదేహల వెలికితీత

ఏపీ రాష్ట్రంలోని రాజంపేట చెయ్యేరు వరద ఉధృతిలో సుమారు 30 మంది కొట్టుకుపోయారని స్థానికుుల చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు.

12 dead bodies found in flash flood in Andhra pradesh
Author
Guntur, First Published Nov 19, 2021, 7:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాజంపేట: భారీ వర్షాలు కడప జిల్లా రాజంపేటలో తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. మూడు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్న ఘటనలో  ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు,నందలూరు ప్రాంతంలో మూడు ఆర్టీసీ బస్సులు flood water నీటిలో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. ఉదయం నుండి గాలింపు చేపట్టారు. సహాయక సిబ్బంది ఇప్టటి వరకుత 12 మృతదేహాలను వెలికి తీశారు.గండ్లూరులో ఏడు, రాయవరంలో 3,  మండపల్లిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. అయితే స్థానికులు మాత్రం  వరదలో కొట్టుకుపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయమై కచ్చితమైన సమాచారం అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. నందలూరు  ఆర్టీసీ బస్సులో మూడు మృతదేహలను వెలికి తీశారు. 

also read:భారీ వర్షాలతో దక్షిణ కోస్తా, రాయలసీమ అతలాకుతలం: రేపు జగన్ ఏరియల్ సర్వే

ఇవాళ  వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన చర్చించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై చర్చించారు. తమ తమ జిల్లాల్లో కురిసిన భారీ వర్షంతో చోటు చేసుకొన్న పంట నష్టం ఇతర వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 

 వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యల పర్యవేక్షణకు నెల్లూరులో సీనియర్‌ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు సీనియర్‌ అధికారి ప్రద్యుమ్న, కడపకు మరో సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌లను నియమించిన విషయాన్ని సీఎం కలెక్టర్లకు చెప్పారు.చిత్తూరు జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను కలెక్టర్‌ హరినారాయణ్, స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్న సీఎం జగన్ కు వివరించారు. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారుచెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై తగిన కార్యాచరణను సిద్ధం చేయాలన్న సీఎం ఆదేశించారుతిరుపతి నగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలని సీఎం సూచించారు. అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్‌ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

భారీ వర్షాలతో పలు రైళ్ల రద్దు

Heavy rains కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మరోవైపు కొన్ని రైళ్లను దారి మళ్లించారు. తడ-సూళ్లూరు‌పేట మార్గంలోప్రమాదకర స్థాయిలో వర్షం నీరు వరద నీరు ప్రవాహిస్తోంది. ఈ మార్గంలో  ప్రయాణించే రైళ్లను రద్దు చేశారు.త్రివేండ్రం-షాలిమార్, ముంబై సీఎస్‌టీ- చెన్నై సెంట్రల్, తిరుపతి-హెచ్ నిజాముద్దీన్, కాచిగూడ-మంగుళూరు, బెంగుళూరు-గౌహతి, చెన్నైౌ సెంట్రల్- హౌరా,చెన్నై సెంట్రల్- విజయవాడ, నందలూరు- రాజంపేట మధ్య నడిచే 12 రైళ్లను దారి మళ్లించారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్  రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఫోన్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios