Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. విమానంలో మహిళపై మూత్ర విసర్జన,ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ..అసభ్య ప్రవర్తన.. చివరికి..

ఓ వ్యక్తి మద్యం మత్తులో బిజినెస్ క్లాస్ లో కూర్చున్న మహిళ మీద మూత్రవిసర్జన చేశాడు. ఆ తరువాత ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు..

Drunk man pees on woman in US flight
Author
First Published Jan 4, 2023, 10:36 AM IST

ముంబై : న్యూయార్క్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 70యేళ్ల ఓ వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురయ్యింది. మద్యం మత్తులో ఉన్న తోటి ప్రయాణికుడు ఆమె మీద మూత్రవిసర్జన చేశాడు. అంతేకాదు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తుంది. ఈ విషయాన్ని క్యాబిన్ క్రూకు తెలిపి అప్రమత్తం చేసింది. అయితే వారు అలా ప్రవర్తించిన వ్యక్తిని పట్టించుకోలేదు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత అతను హాయిగా చేతులూపుకుంటూ వెళ్లిపోయాడు.

తనకు జరిగిన ఈ అవమానాన్ని ఆ మహిళ టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది. లేఖ రాసిన తర్వాతే ఎయిర్‌ ఇండియా దీనిమీద దర్యాప్తు ప్రారంభించిందని ఓ వర్గాలు తెలిపాయి. ఆ మహిళ లేఖలో రాస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన, బాధాకరమైన పరిస్థితి. కానీ దీన్ని సరిగా హ్యాండిల్ చేయడంలో సిబ్బంది చురుగ్గా లేరు. వారు రెస్పాండ్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకున్నారు. నా బాధను వెళ్లగక్కుతున్నా పట్టించుకోలేదు. ఈ ఘటనలో నాకు భద్రత లేదా సౌకర్యాన్ని కల్పించేందుకు విమానయాన సంస్థ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దీనికి నేను బాధపడ్డాను" అని మహిళ లేఖలో పేర్కొంది.

ఈ సంఘటన నవంబర్ 26న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు న్యూయార్క్-జెఎఫ్‌కె విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-102లో జరిగింది. “భోజనం ఇచ్చిన కాసేపటికి, లైట్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఆ సమయంలో ఓ ప్రయాణీకుడు పూర్తిగా మత్తులో తూలుతూ నా సీటు వద్దకు వచ్చాడు. అతను నా ముందుకు వచ్చి తన ప్యాంట్‌ జిప్ తీశాడు. ఆ తరువాత యూరిన్ పోశాడు. అతని ప్రైవేట్ భాగాలను నాకు చూపిస్తూ.. అసభ్యంగా ప్రవర్తించడం కొనసాగించాడు”అని లేఖలో పేర్కొన్నారు. 

అంతేకాదు, మూత్రవిసర్జన తర్వాత, ఆ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అక్కడే చాలాసేపు నిలబడ్డాడు. మరో ప్రయాణికుడు అతడిని అక్కడినుంచి వెళ్లాలని కోరిన తర్వాత మాత్రమే  కదిలాడు. అతను తన సీటునుంచి దూరంగా వెళ్లగానే.. బాధిత మహిళ వెంటనే క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించింది. “నా బట్టలు, బూట్లు, బ్యాగ్ పూర్తిగా మూత్రంతో తడిసిపోయాయి. నేను కంప్లైంట్ చేయగానే స్టీవార్డెస్ నా సీటు దగ్గరకు వచ్చి, చూసి.. అక్కడ మూత్రం వాసన ఉందా అని పరిశీలించి, ధృవీకరించింది. నా బ్యాగ్ మరియు బూట్లపై క్రిమిసంహారక మందులను స్ప్రే చేసింది... ”అని లేఖలో పేర్కొన్నారు.

మహిళా ప్రయాణికురాలు ఎయిర్‌లైన్ లావెటరీలో శుభ్రం చేసుకున్న తర్వాత, సిబ్బంది ఆమెకు మార్చడానికి పైజామా, డిస్పోజబుల్ చెప్పులు ఇచ్చారు. మురికిగా ఉన్న తన సీటుకు తిరిగి రావడానికి ఆమె ఇష్టపడకపోవడంతో ఆమె దాదాపు 20 నిమిషాల పాటు టాయిలెట్ దగ్గరే నిల్చుంది. దీంతో ఆమెకు క్యాబిన్ క్రూకు అలాట్ చేసిన ఇరుకైన సీటు ఇచ్చారు. అక్కడే ఆమె ఒక గంట పాటు కూర్చుంది. ఆ తరువాత ఆమెను తన సీటుకు వెళ్లమని కోరారు. సీటు మీద షీట్లు వేశారు. కానీ ఇంకా యూరిన్ వాసన వస్తూనే ఉంది.’ అని ఆమె చెప్పింది.

కారు కింద నా ఫ్రెండ్ ఇరుక్కుపోయిందని వారికి తెలుసు.. ఉద్దేశపూర్వకంగానే కారు నడిపారు - అంజలి సింగ్ స్నేహితురాలు

అలా రెండు గంటలు గడిచిన తర్వాత, ఆమెకు మరొక సిబ్బంది సీటు ఇచ్చారు. అక్కడే ఆమె ప్రయాణం మొత్తం కూర్చున్నారు. అయితే ఫస్ట్ క్లాస్‌లో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆమె తోటి ప్రయాణీకుడు తరువాత తెలిపాడు. "ఇంత అవమానకరమైన పరిస్థితుల్లో ప్రయాణికుడిని జాగ్రత్తగా చూసుకోవడమే మొదటి ప్రాధాన్యత అనేది సిబ్బందికి అనిపించలేదు. విమానం ఢిల్లీ చేరే సమయానికి, వీలైనంత త్వరగా నేను కస్టమ్స్‌ను క్లియర్ చేసేలా చూసుకోవడానికి నాకు వీల్‌చైర్ ఇప్పిస్తామని సిబ్బంది చెప్పారు. అయితే, వీల్‌చైర్ కోసం నేను వెయిటింగ్ ఏరియాలో 30 నిమిషాలు ఎదురుచూశాను. కానీ ఎవ్వరూ నన్ను తీసుకెళ్లడానికి రాలేదు. చివరకు నేనే స్వయంగా కస్టమ్స్‌ను క్లియర్ చేసుకున్నాను. నా సామాను నేనే సేకరించుకున్నాను. ఇదంతా చేస్తున్న సమయంలో నేను ఎయిర్ ఇండియా పైజామాలు, సాక్స్‌లు వేసుకునే ఉన్నాను’ ఆమె చెప్పింది.  

నేరం చేసిన వ్యక్తికి జరిమానా విధించడమే కాకుండా నో ఫ్లై లిస్ట్‌లో కూడా పెట్టాలి. అటువంటి అసహ్యకరమైన ప్రవర్తనను ప్రదర్శించిన తర్వాత కూడా అతను ఫ్రీగా వెళ్లాడంటే.. సిబ్బందిపై చాలా నెగెటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇటువంటి నిర్లక్ష్యమే చెడు ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది... అని రాశారు. 

దీనిమీద సీనియర్ ఎయిర్‌లైన్ కమాండర్ మాట్లాడుతూ, "క్యాబిన్ సిబ్బంది కంపెనీ విధానాలను అనుసరించి, పైలట్‌కు సమాచారం అందించి, సదరు ప్రయాణీకుడిని వేరుచేసి, ల్యాండింగ్‌లో సెక్యూరిటీకి అప్పగించి ఉండాలి."

దీనిమీద ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో, “ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా పోలీసులకు, కంట్రోల్ ఆఫీసర్లకు తెలిపింది.  బాధిత ప్రయాణీకురాలితో సంప్రదింపులు జరుపుతున్నాం”  అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios