భార్యపై అనుమానంతో ఓ భర్త అత్యంత కిరాతకానికి దిగజారాడు. ఆమెతో అసహజ పద్ధతిలో శృంగారం చేయడమే కాకుండా, వేడి కత్తితో ఆమె జననాంగాలపై కాల్చాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. 

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ కలిగించే దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ భర్త తన భార్యమీద అనుమానంతో అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఆమెతో అసహజ శృంగారం జరపడమే కాకుండా.. అనేక రకాలుగా వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు ఆమె జననావయవాలపై వేడి కత్తితో కాల్చాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే.. 

ఇండోర్‌లోని క్షిప్రా పోలీస్ స్టేషన్ కు శనివారం ఓ మహిళ తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. పోలీసులు మొదట అదేదో చిన్న గొడవ.. భార్యభర్తల మధ్య మామూలుగా వచ్చేవే అనుకున్నారు. అయితే ఆమె.. తన మీద జరుగుతున్న వేధింపుల గురించి చెబుతుంటే.. విన్న పోలీసులకే ఒళ్లు జలదరించింది. తమ థార్డ్ డిగ్రీకంటే ఘోరంగా ఆ భర్త ఆమె మీద లైంగిక వేదింపులకు పాల్పడుతుండడం పోలీసుల్నే షాక్ కు గురి చేసింది. మహిళ ఫిర్యాదుతో వెంటనే పోలీసులు భర్తపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకున్నారు. నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు.

అమానుషం : రేప్ కి సహకరించలేదని.. వేడి కత్తితో కళ్లు కాల్చి, చితకబాది...

జననావయవాలపై వేడి కత్తిని అదిమి పెట్టి, అలాగే ఉంచేయడంతో.. ఆమె తీవ్రంగా గాయపడింది. ఫిర్యాదు తరువాత పోలీసులు ఆమెను ఆస్పత్రికి పంపించారు. అక్కడ ఆమెకు వైద్యం అందుతోంది. అయితే బాధితురాి పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సదరు మహిళకు 16 ఏళ్ల క్రితం నిందితుడితో వివాహం అయ్యింది. అయితే, భర్త ఆమె మీద అనుమానం పెంచుకుని, తరచూ గొడవ పడేవాడు. సెప్టెంబరు 24 శనివారం, భర్త అది పరాకాష్టకు చేరుకుంది. భార్యపై ప్రతీకారం తీర్చుకోవడానికి, అతను తన భార్యతో అసహజ పద్ధతిలో శృంగారం జరపడమే కాకుండా, వేడికత్తితో మహిళ జననాంగాలను కాల్చాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధిత మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఫిర్యాదు తీసుకున్న వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మహిళ భర్త క్షిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా లోయలో కూలి పని చేస్తూ కుటుంబంతో నివసిస్తున్నాడు. నిందితుడు డ్రగ్స్ కు బానిస. సెప్టెంబర్ 24 శనివారం, అతను మొదట తన భార్యతో గొడవ పడ్డాడు. ఆమె మీద అనుమానంతో ప్రశ్నించడం మొదలు పెట్టాడు. అలా గొడవ పెద్దగా అయ్యింది. దీంతో ఆ దుర్మార్గుడైన భర్త భార్యతో బలవంతంగా అసహజ శృంగారం చేసి.. వేడికత్తితో ఆమె ప్రైవేట్ పార్ట్‌లో పొడిచాడు. దీంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడిన స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇండోర్ రూరల్ ఎస్పీ భగవత్ సింగ్ విర్దే తెలిపిన వివరాల ప్రకారం.. కేసు తీవ్రత దృష్ట్యా ఐపీసీ 377, 326 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ భర్త పట్టుబడినప్పుడు, అతను ఇంకా మత్తులోనే ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతని కుటుంబం షాజాపూర్‌కు చెందినది. నిందితుడు భార్యపై పాల్పడిన వేధింపులకు సంబంధించి, మరిన్ని కేసులు పెట్టే యోచనలో కూడా పోలీసులు ఉన్నారు. ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనివల్ల నిందితుడికి కఠినాతి కఠినమైన శిక్ష పడేలా చేయాలని, దీంతో ఇలా వేధింపులకు పాల్పడే వారికి గుణపాఠం తెలపాలని పోలీసులు భావిస్తున్నారు.