Asianet News TeluguAsianet News Telugu

Drugs Seize: ముంబై ఎయిర్‌పోర్ట్ లో రూ. 60 కోట్ల భారీ డ్రగ్స్ పట్టివేత.. మహిళ అరెస్ట్

Drugs Seize: మాదకద్రవ్యాలు(డ్రగ్స్) అక్రమ రవాణాను అడ్డుకోవ‌డం కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకవ‌చ్చిన వాటి  అక్రమ రవాణా ఆగడం లేదు.తాజాగా ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ను కస్టమ్‌ అధికారులు పటుకున్నారు. జింబాబ్వే నుంచి వచ్చిన ప్రయాణికురాలి వ‌ద్ద దాదాపు కోట్ల రూ .60 కోట్ల‌ విలువ చేసే 8,586 గ్రాముల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్‌ చేశారు
 

Drugs worth Rs 60 cr seized at Mumbai airport
Author
Hyderabad, First Published Feb 13, 2022, 12:54 PM IST

Drugs Seize: మాదకద్రవ్యాలు(డ్రగ్స్) అక్రమ రవాణాను అడ్డుకోవ‌డం కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకవ‌చ్చిన వాటి  అక్రమ రవాణా ఆగడం లేదు. నేరస్థులు రోజుకో కొత్త‌ మార్గంలో ఇతర దేశాల నుంచి అక్రమంగా రూ.కోట్ల డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. తాజాగా ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ను కస్టమ్‌ అధికారులు పటుకున్నారు. జింబాబ్వే నుంచి వచ్చిన ప్రయాణికురాలి వ‌ద్ద దాదాపు కోట్ల రూ .60 కోట్ల‌ విలువ చేసే 8,586 గ్రాముల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్‌ చేశారు. నిందితురాలిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. 

ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం..  జింబాబ్వే లోని హరారే నుండి ఢిల్లీ చేరుకున్న మహిళ  దాదాపు కోట్ల రూ .60 కోట్ల‌ విలువ చేసే 8,586 గ్రాముల హెరాయిన్‌ను తీసుకువెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ తో పాటు ఫైల్ ఫోల్డర్ లో దాచి తరలించేయత్నం చేసింది జింబాబ్వే మహిళ. అయితే ఆమె ప్ర‌వ‌ర్త‌న కాస్త తేడా క‌నిపించ‌డంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు.

ఫిబ్రవరి 12న రువాండ్ఎయిర్ ఫ్లైట్ WB-500 ద్వారా హరారే నుండి ముంబైకి వచ్చింది. ఆమెను కస్టమ్స్ అధికారులు పలు సార్లు ప్రశ్నించినా.. ఏం చెప్ప‌లేదు. దీంతో క‌స్ట‌మ్ అధికారులు త‌మ‌దైన  విచారించ‌డంతో అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించింది. త‌నిఖీ చేసేట‌ప్ప‌డు స్కానింగ్ కు చిక్కకుండా హెరాయిన్ ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి, ట్రాలీ బ్యాగ్ ఫైల్ ఫోల్డర్ లో దాచినట్లు కస్టమ్‌ అధికారులు తెలిపారు. 8.486 గ్రాముల  బరువున్న నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాలు (ఎన్‌డిపిఎస్) ను ట్రాలీ బ్యాగ్‌లో, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్‌లో పెట్టి.. రెండు ఫైల్ ఫోల్డర్‌లలో చాకచక్యంగా దాచి  తీసుకవ‌చ్చిన‌ట్టు అధికారులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ. 60 కోట్లు ఉంటుంద‌ని , ప్రయాణికురాలి పై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios