Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్‌‌లో ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ దాడులు.. బస్తాలకొద్దీ డ్రగ్స్ పట్టివేత, 500 కేజీలపైనే

గుజరాత్‌లోని ఓ ఫ్యాక్టరీపై ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ చేసిన దాడుల్లో దాదాపు 513 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీని విలువ రూ.1000 కోట్లు వుంటుందని అంచనా. ఈ ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 

Drugs worth Rs 1,026 crore seized in gujarat
Author
Mumbai, First Published Aug 16, 2022, 7:44 PM IST

గుజరాత్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 513 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి . దీని విలువ రూ.1000 కోట్లు వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడ్డ వారిలో ఒక మహిళ కూడా వున్నట్లుగా తెలుస్తోంది. ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ వున్నట్లుగా సమాచారం రావడంతో ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో బస్తాలకొద్దీ డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

అటు కొద్దిరోజుల క్రితం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఏకంగా 700 కేజీల నిషేధిత మాద‌క ద్ర‌వ్యాల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. అంత‌ర్జాతీయ‌ మార్కెట్‌లో దాని విలువ సుమారు రూ.1400 కోట్లుకు పై మాటే.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసొపారాలో ఉన్న ఫార్మా స్యూటికల్ తయారీ యూనిట్‌పై ముంబై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రూ. 1,400 కోట్ల విలువైన 700 కిలోలకు పైగా 'మెఫెడ్రోన్'ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ డ్రగ్ సెల్ (ANC) ఈ దాడులు నిర్వహించిందని పోలీసులు తెలిపారు. యాంటీ డ్రగ్ సెల్ కు ఈ ప్రాంతంలో నిషేధిత డ్రగ్ 'మెఫెడ్రోన్' తయారు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు.  

ALso REad:హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా .. నైజీరియన్లపై ఫోకస్ పెట్టిన పోలీసులు

ఈ డ్ర‌గ్స్ ముఠాలో ఒక్క‌రు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అని, తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రగ్స్ తయారు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిషేధిత డ్ర‌గ్స్ వ్యాపారం చేస్తున్నందుకు నలుగురు నిందితులను ముంబైలో అరెస్టు చేయగా, మరొకరిని నాలాసోపరాలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇంత మొత్తంలో డ్రగ్స్ రికవరీ చేయ‌డం ఇదే తొలిసార‌ని పోలీసులు చెబుతున్నారు. 'మెఫెడ్రోన్ ని.. మియావ్ మియావ్' లేదా MD అని కూడా అంటారు.దీనిని  నేషనల్ నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) నిషేధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios