ప్రేయసి మోజులో భార్యను ఆత్మహత్య చేసుకునేలా చేసినా ఓ డాక్టర్.. ఆ ప్రేయసి చేతిలోనే హతమయ్యాడు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో రెండో భార్యగా మారిన ఆ ప్రేయసి ఘాతుకానికి తెగబడింది. 

మహారాష్ట్ర : ఇదొక వింత స్టోరీ.. భార్య ఉండగా మరో మహిళతో సంబంధం పెట్టుకున్న డాక్టర్.. ఆ భార్య ఆత్మహత్య చేసుకోగానే తన ప్రేయసిని పెళ్లాడాడు.. భార్యను ఆత్మహత్యచేసుకునేలా చేశాడన్న కేసులో డాక్టర్ జైలుకు వెళ్లగానే.. అతని ప్రియురాలు రెండో భార్య మరో వ్యక్తిని పెళ్లాడింది. అతను జైలునుంచి రాగానే మళ్లీ అతడినే పెళ్లాడింది. ఆ తరువాత మరో వ్యక్తితో ప్రేమలో పడింది...బాబోయ్ ఇదేం స్టోరీ అనిపిస్తుంది కదా.. ఇది కట్టుకథ కాదండీ.. మహారాష్ట్రలో నిజంగా జరిగిన స్టోరీ.. చివరికి ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే...

తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వైద్యుడైన మాజీ భర్తను అంతమొందించడానికి ఓ మహిళ ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. మత్తుమందు ఇంజక్షన్ వేయడం తో కోమాలోకి వెళ్లిన బాధితులు 33 రోజుల తర్వాత మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సతీష్ కేశవరావు అనే వ్యక్తికి నాసిక్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఉంది. సుహాసిని అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని కొన్నేళ్ళ క్రితం ఆయన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. 

స్కూల్ కు లేట్ గా వచ్చాడని స్టూడెంట్ కు 200 సిట్ అప్ ల పనిష్మెంట్.. కిడ్నీ వాపుతో హాస్పిటల్ లో చేరిన బాలుడు

ఆ తర్వాత సతీష్, సుహాసిని వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే తొలి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో జైలుకు వెళ్లాడు. అతడు శిక్ష అనుభవిస్తున్న సమయంలో సుహాసిని మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ కొన్ని నెలలకే ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఇదిలా ఉండగా మహమ్మారి సమయంలో Covid బారిన పడిన సుహాసిని చికిత్స కోసం సతీష్ ఆస్పత్రిలో చేరింది.

అప్పటికి జైలు నుంచి విడుదలైన సతీష్ తో మళ్ళీ అనుబంధం పెరిగింది. దీంతో వారు మళ్ళీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ తర్వాత మరో వ్యక్తితో సుహాసినికి సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సతీష్ వారిద్దరిని నిలదీశాడు. సెప్టెంబర్ 10న ఈ విషయమై వారి ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సతీష్ ను అంతమొందించాలని వారు పథకం వేశారు. సతీష్ కు సుహాసిని మత్తు ఇంజక్షన్ ఇచ్చింది.
దీంతో స్పృహ తప్పి పడిపోయిన సతీష్ కోమాలోకి వెళ్లిపోయాడు. దాదాపు ముప్పై మూడు రోజులుగా చికిత్స కొనసాగుతున్నా.. కోలుకోలేక పోయాడు. చివరికి గురువారం మృతి చెందాడు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. సతీష్, సుహాసిని ల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.