జమ్మూకాశ్మీర్ లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో డ్రోన్లతో జారవిడిచిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితుల అరెస్టు చేశారు. వారి నుంచి 4 పిస్టల్స్, 8 మ్యాగజైన్లు, 47 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాదుల కుట్రలను విఫలం చేయడంలో జమ్మూకశ్మీర్ పోలీసులకు భారీ విజయం సాధించారు. జమ్మూకాశ్మీర్ లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో డ్రోన్ నుండి జారవిడిచిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఆదివారం తెల్లవారుజామున బస్పూర్ బంగ్లా ప్రాంతంలో డ్రోన్ల కదలిక గురించి పోలీసులకు తెలిసిందని, ఆ ప్రాంతంలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు.
ఈ క్రమంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామనీ, వారి నుంచి నాలుగు పిస్టల్స్, 8 మ్యాగజైన్లు, 47 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అరెస్టయిన నిందితులను చంద్రబోస్, షంషేర్ సింగ్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
అక్టోబర్ 27 మరియు 28 మధ్య బస్పూర్ బంగ్లా ఆర్ఎస్ పురా ప్రాంతంలో డ్రోన్ యొక్క అనుమానాస్పద కదలికను గమనించినట్లు పోలీసులు తెలిపారు.టెక్నికల్ మానిటరింగ్ యూనిట్ ద్వారా ఆ సమయంలో పోలీసు చెక్‌పాయింట్ మీదుగా వెళ్లే అన్ని వాహనాలను తనిఖీ చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లే రహదారి, సాధారణ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణలో సమయంలో చంద్రబోస్ కుమారుడు వాస్దేవ్ నివాసి దోడా అనే అనుమానితుడిని జమ్మూ పోలీసులు పట్టుకున్నారు.
సరిహద్దు దగ్గరికి వెళ్లడానికి గల కారణం ఏమిటని పోలీసులు ప్రశ్నించగా.. సరైన సమాధానం ఇవ్వక పోయే సరికి పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డ్రోన్ నుండి పడిపోయిన ఆయుధాల సరుకును తీయడానికి తాను అక్కడికి వెళ్లినట్లు అంగీకరించాడు. క్యాంప్ గోలే గుజ్రాల్ జమ్మూలో నివాసం ఉంటున్న షంషేర్ సింగ్ కుమారుడు ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి కోరిక మేరకు తాను ఈ పని చేస్తున్నానని ఆయన వెల్లడించారు.
