Asianet News TeluguAsianet News Telugu

చావు చూపించిన అమెరికా డ్రీమ్.. అక్రమంగా వెళ్లడానికి ప్రయత్నించిన గుజరాత్ వాసులు.. ‘ప్రాణాలైనా దక్కాయి’

అమెరికా కల వారి ప్రాణాల మీదికి తెచ్చింది. గుజరాత్ నుంచి అమెరికా వెళ్లి సెటిల్ కావాలని సుమారు 19 మంది బయల్దేరారు. వారు అక్రమ మార్గంలోనైనా అమెరికా వెళ్లాలని ప్రయాణం చేశారు. కానీ, ఈ గ్రూపుతోపాటే వెళ్లిన నలుగురు ఈ ఏడాది జనవరిలో కెనడా, అమెరికా బార్డర్‌లో చలిలో గడ్డకట్టుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేసిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 

dreaming their life in america started in illegal route to enter but returned and knew that agent dumped them
Author
First Published Dec 16, 2022, 1:30 PM IST

న్యూఢిల్లీ: అమెరికాను డ్రీమ్ ల్యాండ్ అంటారు. చాలా మంది అక్కడ నివసించాలని ఉవ్విళ్లూరుతుంటారు. మన దేశంలోనూ అలాంటివారు ఉన్నారు. గుజరాత్‌కు చెందిన 19 మంది అదే జాబితాలోకి వస్తారు. అక్రమ మార్గంలోనైనా సరే అమెరికా వెళ్లాలని వీరు నిర్ణయించుకున్నారు. అక్రమ మానవ రవాణా ఏజెంట్లను నమ్మారు. సగం దూరం వెళ్లారు. నలుగురు మరణించారు కూడా. మిగతా వారు డబ్బు, సమయం వృథా చేసుకున్న ప్రాణాలు దక్కించుకున్నారు.

అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టే ప్రయత్నంలో వారు రూ. 75 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. దుబాయ్‌లో ఒక నెల రోజులు గడిపారు. అయినప్పటకీ గుజరాత్‌లోని ఉత్తర పట్టణాలకు చెందిన ఎనిమిది మంది తిరిగి స్వస్థలానికి రావల్సి వచ్చింది. ఇంతలోనే వారితోపాటు బయల్దేరి వెళ్లిన దిగుంచాకు చెందిన ఓ కుటుంబం కెనడా నుంచి అక్రమంగా అమెరికాలో అడుగు పెట్టడానికి మంచులో నడుచుకుంటూ వెళ్లి గడ్డకట్టి మరణించిన ఘటన చోటుచేసుకుంది. డబ్బు, సమయం పోయినా.. ప్రాణాలైనా దక్కించుకున్నామని వారు ఆ తర్వాత అనుకున్నారు.

ఈ ఏడాది జనవరిలో జగదీశ్ పటేల్ కుటుంబం కెనడా, అమెరికా సరిహద్దులో చలికి గడ్డకట్టి మరణించిన ఘటన కలకలం రేపింది. అమెరికాకు 12 కిలోమీటర్ల దూరంలో మైనస్ 35 డిగ్రీల సెల్సియస్‌లో శీతలంలో వారు ప్రయాణిచారు. దీంతో జగదీశ్ పటేల్ (35), అతని భార్య వైశాలి (33), వారి పిల్లలు విహంగ (12), ధార్మిక్ (3)లు జనవరి 19న గడ్డకట్టుకుపోయి మరణించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి అమెరికా, కెనడా దర్యాప్తు సంస్థలు గుజరాత్ పోలీసులను ఆశ్రయించి కోఆర్డినేట్ చేసుకున్నారు.

Also Read: అక్రమ దారిలో అమెరికా వెళ్లాలనుకున్నారు! టర్కీలో 37 గుజరాతీ కుటుంబాలు ‘మిస్సింగ్’.. మాఫియానే కిడ్నాప్ చేసిందా?

ఈ కేసు విచారిస్తున్న గుజరాత్ పోలీసువర్గాల సమాచారం మేరకు.. గుజరాత్ నుంచి మొత్తం 19 మంది అక్రమమార్గంలో అమెరికాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారంతా ఢిల్లీకి వచ్చారు. అక్కడే 11 మంది ఒక గ్రూపు,8 మంది ఒక గ్రూపుగా మిగిలారు. 11 మంది గ్రూపులోనే దిగుంచా కుటుంబం ఉన్నది. వీరు ఢిల్లీ నుంచి దుబాయ్ అక్కడి నుంచి కెనడాకు వెళ్లి అక్కడ నుంచి సరిహద్దు గుండా అమెరికాలో అడుగుపెట్టాలని ప్రయత్నించారు. కాగా, 8 మంది గ్రూపు మాత్రం దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి మెక్సికో.. మెక్సికో నుంచి అక్రమమార్గాన అమెరికాలోకి వెళ్లాలని అనుకున్నారు.

అనుకున్నట్టుగానే వారంతా దుబాయ్ వెళ్లారు. అక్కడి నుంచి 11 మంది కెనడాకు వెళ్లారు. అక్కడ జగదీశ్ పటేల్ కుటుంబం ఆ గ్రూపు నుంచి వేరైంది. వారు సరిహద్దు నుంచి నడుచుకుంటూ అమెరికా వెళ్లాలని ఫిక్స్ అయిపోయి ప్రయాణం ప్రారంభించారు. కానీ, దారి మధ్యలోనే వారు ప్రాణాలు కోల్పోయారు.

కాగా, దుబాయ్‌లోని 8 మంది మాత్రం మెక్సికో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, మానవ అక్రమ రవాణా చేసే మెక్సికో ఏజెంట్లు ఇంకా స్పందించడం లేదని, వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వెయిట్ చేయాలని వీరిని అక్కడే నిలిపేశారు. సుమారు నెల రోజులు అక్కడే గడిపారు. ఆ తర్వాత తమ ఢిల్లీ ఏజెంట్ కమ్యూనికేషన్‌లో లేకుండా పోయాడు. దీంతో తామంతా మోసపోయామని గ్రహించి గుజరాత్‌కు తిరుగుప్రయాణం అయ్యారు.

ఆ ఢిల్లీ ఏజెంట్‌ను గాంధీనగర్ తాలూక కలోల్‌‌లోని పాలియాడ్ గ్రామానికి చెందిన ఏజెంట్ కోఆర్డినేట్ చేస్తున్నారు. దీంతో పాలియాడ్ ఏజెంట్ వద్దకు వెళ్లి తమ డబ్బు డిమాండ్ చేశారు. అతను పెద్ద మొత్తంలో డబ్బు వీరికి ఇవ్వాల్సి ఉన్నది. ఆ డబ్బు సేకరించడానికి ఇల్లు, భూమి అంతా అమ్ముకున్నాడు. ఇప్పుడు ఎవరికీ టచ్‌లో లేకుండా అండర్‌గ్రౌండ్ వెళ్లిపోయాడు. అటు బాధితులకు, ఇటు పోలీసులకూ కనిపించకుండా పారిపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios