150 సార్లు తిరస్కరణకు గురైనా.. పట్టు విడవలే.. అందుకే నేడు కోటీశ్వరుల లీస్ట్ లో ఉన్నాడు..

అనుకున్నది సాధించాలంటే ఓపిక, పట్టుదల ఉండాల్సిందే. ఇవి లేకే ఎంతో మంది ప్రతిభ ఉన్నా.. అనుకున్నది సాధించలేపోతున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అనుకున్నది నెరవేర్చేందుకు ఏకంగా 150 సార్లు తిరస్కరించబడ్డా.. పట్టు విడువకుండా ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే?

 dream 11 founder harsh jain success story rsl


ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి తెలియనివారుండరు. కొంతమంది క్రికెట్ అభిమానులు డ్రీమ్ 11 అనే ప్రసిద్ధ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ ను ఉపయోగించి తమ అభిమాన జట్లు లేదా ఆటగాళ్లతో వర్చువల్ గా ఆడుతారు. అయితే ఈ యాప్ ను ఎవరు స్థాపించారు? దాని యజమాని ఎవరు? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆర్టికల్ ద్వారా మనం డ్రీమ్ 11 సహ వ్యవస్థాపకుడు, సీఇఓ హర్ష్ జైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఈ డ్రీమ్ 11 సహ వ్యవస్థాపకుడు భారతదేశంలోని అత్యంత ధనవంతులైన యువ బిలియనీర్లలో ఒకరు. హర్ష్ జైన్ తన స్నేహితుడు భవిత్ సేథ్ తో కలిసి 2008 లో డ్రీమ్ 11 ను స్థాపించారు. ఐపీఎల్, ఇతర క్రికెట్ టోర్నమెంట్ల సక్సెస్ తో ఇతని యాప్ పెద్ద మొత్తాన్నే సంపాదించింది. ప్రస్తుతం డ్రీమ్ 11 రూ.65,000 కోట్ల కంపెనీ. ఈ ప్లాట్ ఫామ్ లో 150 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

ముంబైలో పుట్టిన హర్ష్ జైన్ కు క్రీడలు, టెక్నాలజీ, గేమింగ్ అంటే ఎంతో ఇంట్రెస్ట్. మాంచెస్టర్ యునైటెడ్, ముంబై ఇండియన్స్, భారత క్రికెట్ జట్టుకు వీరాభిమాని కూడా. 2008లో తొలిసారి ఐపీఎల్ ప్రారంభమైంది. అప్పుడు తన కాలేజ్ ఫ్రెండ్ భవిత్ తో కలిసి డ్రీమ్ 11ను ప్రారంభించాలనే ఆలోచన హర్శ్ జైన్ కు వచ్చింది. ఇంకేంది స్టార్ట్ చేశారు. కానీ డ్రీమ్ 11 తొలినాళ్లలో ఇద్దరూ ఎన్నో ఇబ్బందును ఎదుర్కొన్నారు. కానీ చివరికి గొప్ప విజయాన్ని సాధించారు.

2012 తర్వాత హర్శ్ జైన్ , వ్యవస్థాపక బృందం రెండేండ్లలో దాదాపు 150 మంది వెంచర్ క్యాపిటలిస్టులను నిధుల కోసం సంప్రదించారట. కానీ వారు తిరస్కరించబడ్డారు. అదికూడా ఒకటి కాదు రెండు కాదు 150 సార్లు. ఈ విషయాన్ని హర్ష్ గత ఏడాది ఒక పాడ్కాస్ట్ లో చెప్పారు. కంపెనీ ప్రొడక్ట్, డిజైన్, టెక్, మార్కెటింగ్ ను హర్ష్ పర్యవేక్షిస్తుండగా, భవిత్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు.

2013లో హర్ష్ జైన్ డెంటల్ డాక్టర్ రచనా షాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి క్రిష్ అనే కొడుకు ఉన్నాడు. 2021 లో దక్షిణ ముంబైలోని పెద్దార్ రోడ్డులో రూ. 72 కోట్ల విలువైన లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ ను కొన్నారట. 

హర్ష్ 2001 నుంచి 2003 వరకు ఇంగ్లండ్ లోని సెవెన్ ఓక్స్ హైస్కూల్ లో చదువుకున్నాడు. 2003-2007 నుంచి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ లో మూడు నెలల పాటు సమ్మర్ ఇంటర్న్ గా చేరారు. కొలంబియా యూనివర్శిటీలోని కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు.

జూలై 2010 లో హర్ష్ ముంబైలో రెడ్ డిజిటల్ అనే సోషల్ మీడియా ఏజెన్సీని స్థాపించాడు. అయితే 2013లో ఈ సంస్థను ముంబైలోని గోజూప్ అనే మార్కెటింగ్ ఏజెన్సీ కొనుగోలు చేసింది. 2017లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు హర్ష్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios