రాజస్థాన్ లో ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇది అక్కడ కలకలం రేపింది. దీంతో వైద్యులంతా ఆందోళనకు దిగారు. వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని తెలిపారు.

జైపూర్ : pregnantకి చికిత్స చేస్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Gynecologist నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందంటూ police stationలో ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదయ్యింది. దీంతో మనస్తాపం చెందిన ఆ doctor బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది. రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో జరిగింది ఈ ఘటన. పోలీసుల సమాచారం ప్రకారం డా.అర్చనా శర్మ, ఆమె భర్త కలిసి lalsotలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. సిజేరియన్ చేస్తుండగా ఓ గర్భిణి సోమవారం మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెపై చర్యకు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన వైద్యురాలు ఆస్పత్రి పైనే ఉన్న తన నివాసంలో మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. తాను నిర్ధోషి అని చెప్పడానికి చావే సాక్ష్యం అని, అమాయక డాక్టర్లను వేధించడం మానుకోవాలని అందులో పేర్కొంది.

పోలీసులపై చర్యలు చేపట్టాలి..
ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యులను ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఇందుకు నిరసనగా బుధవారం వైద్య సేవలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వృత్తిపరమైన విధుల్లో ఉన్నప్పుడు వైద్యులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలలో ఉందని ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ గేమ్స్ సొసైటీ సెక్రటరీ డాక్టర్ విజయ్ కపూర్ అన్నారు. ఈ ఘటనలో వైద్యురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు అని, అందుకే ఆమె కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బాధ్యులైన పోలీస్ అధికారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడించారు.

కేసులో సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకొని డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను విడిచి పెట్టబోమని స్పష్టం చేశారు. ‘డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్య విచారకరం. రోగుల ప్రాణాలను కాపాడటం కోసం డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నిస్తారు. కానీ ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు వారి నిందించడం సమంజసం కాదు’ అని గహ్లోత్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, గతంలో తెలంగాణలోని మిర్యాలగూడలో ఓ వైద్యురాలు ఆత్మహత్య కలకలం రేపింది. మిర్యాలగూడలో స్టార్ ఆస్పత్రి నిర్వాహకురాలు, దంత వైద్యురాలు డాక్టర్ శ్వేత(32) ఆత్మహత్య చేసుకున్నారు. తాను నివాసం ఉంటున్న ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన అనంతుల నాగయ్య, పుష్పలత దంపతుల కుమార్తె డాక్టర్ శ్వేతకు శాలీగౌరారం మండల కేంద్రానికి చెందిన పిల్లల వైద్యుడు బండారు కుమార్ తో 2009లో వివాహం జరిగింది. ఆయన స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. శ్వేత డాక్టర్స్ కాలనీలో స్టార్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.

వీరికి తొమ్మిదేళ్ల వయసు కుమార్తె కూడా ఉంది. పట్టణంలోని రెడ్డికాలనీలో వీరు అద్దెకు ఉంటున్న ప్లాట్ నుంచి బుధవారం ఉదయం భర్త ఆస్పత్రికి వెళ్లారు. కొంత సేపటి తర్వాత తాను బయట షాపింగ్ కు వెళ్తున్నాని చెప్పి.. కుమార్తెను పక్కింటికి పంపింది. మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి భర్త ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా స్పందించించకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపుల పగలకొట్టి వెళ్లిచూశాడు. కాగా.. అప్నటికే శ్వేత చనిపోయి ఉంది. ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంది. కాగా.. తమ అల్లుడే అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించాడని.. అందుకే ఆత్మహత్య చేసుకుందని శ్వేత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.