Asianet News TeluguAsianet News Telugu

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దు: సుప్రీంకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

Dont exceed 50 percent reservation in local body polls says supreme court
Author
New Delhi, First Published May 20, 2020, 2:50 PM IST


న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ లు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

2010లో కె. కృష్ణమూర్తి  కేంద్ర ప్రభుత్వం మధ్య సుప్రీంకోర్టు ఐదుగురు ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇందిరా సహాని కేసు, 2016లో జయరాజు కేసులో కొన్ని మినహాయింపులు ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి రామ్మోహన్ నాయుడు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

2010లో తీర్పు వచ్చిన సందర్భంలో బీసీ జనగణన డేటా లేదని, ప్రస్తుతం ఆ డేటా అంతా నమోదై ఉందని కామత్ వివరించారు. ఇవేమీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని తేల్చి చెప్పిన ధర్మాసనం పిటిషన్ ను తోసిపుచ్చింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios