Asianet News TeluguAsianet News Telugu

అల్లోపతిపై తప్పుడు ప్రచారం.. బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు..

బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. వ్యాక్సిన్ల మీద, ఆల్లోపతి మీద ఆయన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. 

Donot mislead public against allopathy, Delhi Highcourt tells Ramdev baba
Author
Hyderabad, First Published Aug 18, 2022, 12:38 PM IST

న్యూఢిల్లీ : covid-19 వ్యాక్సిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో యోగా గురువు Ramdev babaకు మొట్టికాయలు వేసింది ఢిల్లీ హైకోర్టు. అల్లోపతి ఔషధాలు, చికిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని స్పష్టం చేసింది. కోవిడ్-19 బూస్టర్ డోస్  సామర్థ్యం,  అమెరికా అధ్యక్షుడు  Joe biden టీకా తీసుకున్నా కరోనా బారినపడిన అంశంపై మాట్లాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, కరోనిల్ కోవిడ్ పై పని చేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా రాందేవ్ బాబాకు చురకలు అంటించింది ధర్మాసనం.

‘ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. ఇది విదేశాలతో దేశ సంబంధాలపై  తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ నేతల పేర్లను సూచించడం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు దెబ్బతింటాయి. బాబా  రాందేవ్ చేసిన ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. మీరు  ఏది చెప్పినా నమ్మే అనుచరులను కలిగి ఉండటాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు’ అని జస్టిస్  అనుప్ జైరాం భంభాని పేర్కొన్నారు. 

బీహార్ లో ప్రేమోన్మాది ఘాతుకం.. 15యేళ్ల బాలికను తుపాకీతో కాల్చి పరార్..

మరోవైపు పతంజలి కరోనిల్ ను సవాలు చేశారు. డాక్టర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది అఖిల్ sibal. ఎలాంటి ట్రయల్స్, సరైన ధ్రువీకరణ లేకుండానే కరోనిల్ కోవిడ్-19ను నయం చేస్తుందని పతంజలి చెబుతోందని కోర్టుకు తెలిపారు. గతంలోనే బాబా రాందేవ్ సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారం వ్యక్తి చేస్తున్నారంటూ భారత వైద్యుల సంఘం (ఐఎంఏ) ఫిర్యాదు చేసింది. కరోనా ఉగ్రరూపం దాల్చిన క్రమంలో కరోనా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios