Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో ప్రేమోన్మాది ఘాతుకం.. 15యేళ్ల బాలికను తుపాకీతో కాల్చి పరార్..

తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి తెగించాడు. తొమ్మిదో తరగతి బాలికను స్కూల్ నుంచి వస్తుండగా.. వెనకనుంచి కాల్పులు జరిపి పరారయ్యాడు. 

Class 9 Student Shot In Neck By Man She Rejected love proposal in Bihar
Author
Hyderabad, First Published Aug 18, 2022, 11:11 AM IST

బీహార్ : అమ్మాయిల మీద అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో వేధింపులు.. ఒప్పుకోలేదని హత్యలు మామూలుగా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఓ ప్రేమోన్మాది దారుణానికి తెగబడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిందని కోపంతో ఓ ప్రేమోన్మాది పదిహేనేళ్ల బాలికను దారికాచి, అటకాయించి తుపాకీతో ఆమె మీద కాల్పులు జరిపాడు. మెడపై తూటా దిగటంతో ఆ బాధితురాలు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ దుశ్చర్య బీహార్ రాజధాని పాట్నాలో బుధవారం జరిగింది. బాలికపై తుపాకీ పేలుస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

బ్యూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. కూరగాయలు విక్రయించే వ్యక్తి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రేమించాలని కొంతకాలంగా ఆమె వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను తిరస్కరిస్తుందనే కోపంతో తుపాకీతో వచ్చాడు. బాలిక అతడితో మాట్లాడకుండా వెడుతుండగా.. వెనకనుంచి మెడపై కాల్పులు జరిపాడు. తూటా దిగడంతో బాలిక అక్కడికక్కడే పడిపోయింది. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యువతీ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని.. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. 

చెల్లి వరుసయ్యే అమ్మాయికి లవ్ ప్రపోజ్.. ఒప్పుకోలేదని కారుతో గుద్ది...

ఇలాంటి ఘటనే జూలై 22న కర్ణాటకలో జరిగింది. తనతో ప్రేమ, పెళ్లికి నిరాకరించిందని యువతిపై కక్ష పెంచుకున్నాడు ఓ యువకుడు. ఆ కసితోనే యువతి ప్రాణాలు తీశాడు. ఆమె తల నరికి పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని విజయనగరం జిల్లా కుడ్లిగి తాలూకా కన్నిబొరయ్య హట్టిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భోజరాజు అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్. తన సమీప బంధువైన బసణ్ణ కుమార్తె నిర్మల (21)మీద మనసు పడ్డాడు. ఆమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అయితే, ఆమె దీనికి నిరాకరించింది.  ఓసారి వారి ఇంటికి వెళ్లి నిర్మలను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు.

దీనికి నిర్మల కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే  భోజరాజుకు 2 నెలల క్రితం మరో యువతితో వివాహం అయ్యింది. పొరుగు జిల్లాలో చదువుకుంటున్న నిర్మల ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది.  ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో నిర్మల ఇంటికి వెళ్లిన భోజరాజు ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తనతో తీసుకువెళ్ళిన కత్తితో ఆమె తల నరికి హత్య చేశాడు. ఆ తరువాత  తలను బైకుకు ఉంచిన సంచిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios