కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా స్తంభించిపోయిన ప్రజా రవాణా వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఇప్పటికే గ్రీన్ జోన్లలో బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు వంటి సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత ప్రభుత్వం.. విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు అనుమతించింది. ఈ నెల 25 సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని కేంద్రం ప్రకటించింది.

ఇప్పటికే అన్ని ఎయిర్ పోర్టులు, ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఇందుకు సంబంధించిన సమాచారం అందించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ పూరీ తెలిపారు. ప్రయాణం సందర్బంగా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర మార్గదర్శకాలను కేంద్రం కొద్దిసేపట్లో విడుదల చేయనుంది.