భార్యను హింసించి పైశాచిక ఆందనం పొందిన ఓ భర్త ఉదంతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ భర్త...కట్టుకున్న భార్యను అతి క్రూరంగా హింసించాడు. భార్య ప్రైవేట్ పార్ట్స్ లో బైక్ హ్యాండిల్ దూర్చాడు. ఆమె ఆ బాధను రెండేళ్లపాటు భరించడం గమనార్హం. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ధర్ జిల్లాకు చెందిన ఓ వివాహిత వయసు 36ఏళ్లు. ఆమెకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. భర్త బ్యాండ్ మేళంలో పనిచేస్తుంటాడు. వీరికి ఆరుగురి సంతానం. రెండేళ్ల క్రితం పిల్లల విషయంలో భార్య, భర్తలకు ఇద్దరి మధ్యా చిన్న గొడవ జరిగింది. ఆ మాత్రం దానికే కోపంతో ఊగిపోయిన భర్త... భార్యను గొడ్డును బాధినట్లు బాదాడు. అంతటితో ఆగకుండా తన పైశాచికం మొత్తం ప్రదర్శించాడు. తన ఇల్లాలి ప్రైవేటు భాగాల్లో బైక్ హ్యాండిల్ దూర్చి నరకం చూపించాడు.

అనంతరం భార్య, బిడ్డలను వాళ్ల మానాన వాళ్లని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. పిల్లల కోసం ఆమె పనులు చేస్తూ... జీవనం గడుపుతోంది. రెండేళ్లుగా ఆమె ప్రైవేటు పార్ట్స్ లో హ్యాండిల్ అలానే ఉండటం గమనార్హం. నొప్పి రోజు రోజుకీ ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళితే ఆపరేషన్ కి రూ.లక్ష ఖర్చు అవుతుందని చెప్పారు.

దీంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారి సహాయంతో ఆమెకు చికిత్స అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు భర్తను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.