శుక్రవారం సాయంత్రం తన కొడుకు కనిపించడం లేదంటూ డాక్టర్ అయిన చిన్నారి తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగినట్లు ఆమె తెలిపారు. ప్రాథమిక విచారణలో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా, డాక్టర్ దగ్గర పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పిల్లవాడి కిడ్నాప్‌ విషయంలో వారి పాత్రల గురించి ప్రశ్నించారని చెప్పారు.

బులంద్‌షహర్ :ఉత్తరప్రదేశ్ లోని Bulandshahrలో దారుణం చోటు చేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో ఓ చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చారు. బాలుడిని కిడ్నాప్ చేసి, పాశవికంగా చంపి.. మృతదేహాన్ని కనిపించకుండా చేశారు. మిస్సింగ్ కేసుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు రెండు రోజుల్లో మిస్టరీని ఛేదించారు. 

గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఓ డాక్టర్ ఎనిమిదేళ్ల కుమారుడి dead bodyని బులంద్‌షహర్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చిన్నారిని kidnap చేసి, murder చేశారనే ఆరోపణలతో డాక్టర్‌ దగ్గర పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు నిజాం, షాహిద్‌లను చటారీ పోలీస్ స్టేషన్ పోలీసులు arrest చేశారు. విచారణలో చటారీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చిన్నారి మృతదేహం ఉన్నట్టుగా తేలడంతో.. గాలింపు చేపట్టి ఆదివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు దేబాయి సర్కిల్ ఆఫీసర్ వందనా శర్మ ఆదివారం తెలిపారు. 

శుక్రవారం సాయంత్రం తన కొడుకు కనిపించడం లేదంటూ డాక్టర్ అయిన చిన్నారి తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగినట్లు ఆమె తెలిపారు. ప్రాథమిక విచారణలో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా, డాక్టర్ దగ్గర పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పిల్లవాడి కిడ్నాప్‌ విషయంలో వారి పాత్రల గురించి ప్రశ్నించారని ఆమె చెప్పారు.

గతంలో డాక్టర్‌ దగ్గర కాంపౌండర్‌లుగా పనిచేసిన వీరిద్దరూ.. తమ పనిలో తప్పిదానికి పాల్పడ్డారని రెండేళ్ల క్రితం ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో పగ పెంచుకున్న వీరు.. డాక్టర్‌ మీది శత్రుత్వంతోనే చిన్నారిని కిడ్నాప్ చేసి.. హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ మేరకు వందనా శర్మ తెలిపారు. ఆ తరువాత చిన్నారి మృతదేహాన్ని ఎక్కడ పారేసింది చెప్పడంతో... పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని శర్మ తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ Kanpurలోని టాట్ మిల్ క్రాస్‌రోడ్ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు accident జరిగింది. electric bus అదుపు తప్పి అనేక మంది పాదచారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించారు. పలువురు గాయపడినట్లు స్థానిక పోలీసులు సమాచారం అందించారు.

ఈ ప్రమాదంలో మూడు కార్లు, పలు బైక్‌లు కూడా ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం వెతుకుతున్నామని తూర్పు కాన్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ తెలిపారు. మరోవైపు, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్‌లో సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ...

"కాన్పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి దురదృష్టకర వార్త అందింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ప్రియాంక హిందీలో ట్వీట్ చేశారు.