న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిన రోగులను చికిత్స అందించిన వైద్యులకు ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ తరహా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వైరల్ వీడియోను  ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.

కరోనా రోగులకు చికిత్స చేస్తున్న కొందరు వైద్యులను ఇండ్లకు రానివ్వని ఘటనలు కూడ దేశంలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకొన్నాయి. రోగులకు చికిత్స చేసి ఇంటికి వచ్చిన వైద్యులపై దాడులకు దిగిన సందర్భాలు కూడ లేకపోలేదు. గుజరాత్ రాష్ట్రంలో ఇదే తరహా ఘటన ఒకటి గతంలో వెలుగు చూసింది.

 

ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స చేసిన వైద్యులపై పలు చోట్ల దాడులు జరిగాయి. హైద్రాబాద్ లో రెండు చోట్ల దాడులు జరిగాయి. క్వారంటైన్ కు తరలించే సమయంలో కూడ వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులపై కూడ దాడులు జరిగాయి.

కరోనా రోగులకు చికిత్స చేసిన ఓ మహిళా డాక్టర్ ఇంటికి 20 రోజుల తర్వాత చేరుకొంది. ఈ విషయం తెలుసుకొన్న ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులు ఆమె కోసం బయటే ఎదురు చూశారు.

also read:భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర: హైదరాబాదులో ధర ఇదీ..

డాక్టర్ కారు దిగి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో పూలు చల్లుతూ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కరోనా రోగులకు సేవ చేసిన ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమెకు ఎదురుగా వచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు. ఈ ఘటనతో డాక్టర్లు భావోద్వేగానికి గురయ్యారు.

ఈ తరహా ఘటనలు రెండు మూడు చోటు చేసుకొన్నాయి.ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ వీడియోను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

ఈ తరహా ఘటనలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయన్నారు. కరోనాపై ధైర్యంగా మేం పోరాటం చేస్తామన్నారు. ఇది ఇండియన్స్ స్పిరిట్ అంటూ మోడీ ట్వీట్ చేస్తూ ఈ వీడియోను షేర్ చేశాడు.ఇదే వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడ షేర్ చేశాడు.