న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గించాయి పెట్రోలియం సంస్థలు. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గిన వేళ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 162.50లకు తగ్గించాయి పెట్రోలియం సంస్థలు.

ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.581.50  కి తగ్గింది. గత ఏడాది జనవరిలో సిలిండర్ ధర రూ.150.50 తగ్గింది. ఇప్పుడు 162.50 తగ్గింది. మూడు మాసాల్లో సబ్సిడీ లేని వంటగ్యాస్ సిలిండర్ కు రూ. 277కు తగ్గిందని పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి.సబ్సిడీ లేని సిలిండర్ ధర హైద్రాబాద్ లో రూ. 207కి తగ్గింది. గత నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర 769 ఉంది.

also read:దేశంలో 35,043కి చేరిన కరోనా కేసులు, ట్రక్కుల రవాణకు అనుమతి: కేంద్రం

న‌గ‌రాల వారీగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో ధ‌ర రూ. 744 నుంచి రూ. 611కు దిగొచ్చింది. కోల్‌క‌తాలో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ. 839 నుంచి రూ. 774కు త‌గ్గింది. ముంబైలో సిలిండ‌ర్ ధ‌ర రూ. 579కి త‌గ్గింది. హైద‌రాబాద్లో సిలిండ‌ర్ ధ‌ర రూ. 862 నుంచి రూ. 796కు త‌గ్గింది. గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది.

ఈ ధరలు ఇవాళ్టి నుండే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. లాక్ డౌన్ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపుతో వినియోగదారులు సంతోషంగా ఉన్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గిన చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజీలతో పాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడ తగ్గించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసే వారు కూడ లేకపోలేదు.