ఉత్తరప్రదేశ్‌లో ఓ 18 ఏళ్ల బాలుడు టీడబ్ల్యూఎస్ వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ కొన్ని గంటల కొద్దీ వాడాడు. దీంతో చెవిలో ఇన్ఫెక్షన్ సోకింది. వినికిడి శక్తి కోల్పోయాడు. దీంతో సర్జరీ చేసుకున్నాడు. 

Earphones: ఉత్తరప్రదేశ్‌లో 18 ఏళ్ల బాలుడు దీర్ఘ కాలం ఇయర్ ఫోన్స్ వినియోగించాడు. గంటల కొద్దీ ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల ఆయన వినికిడి శక్తిని కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వైర్ లెస్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ గంటల తరబడి అతను వినియోగించాడు.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇయర్ ఫోన్స్ లేకుండా జీవితాన్ని ఊహించడం కష్టమే. ప్రయాణిస్తూనే సగం ఫోన్ కాల్స్ మాట్లాడేస్తుంటారు. కాలేజీ పిల్లలైతే సాంగ్స్ వినడంలో నిమగ్నమైపోతారు. అలాగే.. బయటి నుంచి వచ్చే శబ్దాలను తప్పించుకోవడానికి మంచి సంగీతాన్ని ఆలకించాలనే ఉద్దేశంతోనూ ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. కానీ, ఇయర్ ఫోన్స్ అదే పనిగా వాడటం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 

చాలా వరకు ఇయర్ ఫోన్స్ మన చెవి కెనాల్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఇయర్ ఫోన్స్‌ను ఎక్కువ కాలం అలాగే ఉంచితే.. ఇయర్ కెనాల్‌లో బ్యాక్టీరియా, వైరస్ పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గోరఖ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల అబ్బాయికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. డైలీ కొన్ని గంటలపాటు ఇయర్ ఫోన్స్ చెవిలోనే ఉంచుకోవడం వల్ల ఇయర్ కెనాల్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడింది. దీంతో ఆయనకు సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ తొలగించారు. అప్పుడు ఆ అబ్బాయికి మళ్లీ వినిపిస్తున్నది. 

Also Read: లవ్ జిహాద్ కేసు పెట్టిన వారికి దిమ్మదిరిగే ట్విస్ట్.. ఆ ఎఫైర్‌తో షాక్

మన బాడీ తరహాలోనే ఇయర్ కెనాల్‌కు కూడా వెంటిలేషన్ అవసరం ఉంటుందని వైద్యులు తెలిపారు. అందుకే ఎక్కువ కాలం ఇయర్ ఫోన్స్ వాడితే.. అతని చెవిలో చెమట ఏర్పడుతుంది. ఆ తర్వాత అది మరో ఇన్ఫెక్షన్‌కు దారి వేస్తుందని వివరించారు.

ఒక వేళ మీరు కూడా టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్లు వాడాల్సి వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుననారు. ముందు ఇయర్ ఫన్స్‌తో పనిని వేగంగా ముగించుకోవాలి. జనరల్ వాల్యూమ్ కంటే 60 శాతం తక్కువ వాల్యూమ్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ వాడాలని వివరిస్తున్నారు. ఎన్ఏసీ ఇయర్‌ ఫోన్స్ వాడటం మంచిదనీ స్థానికులు చెప్పారు.