రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదని.. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని.. అతని దగ్గరకు వెళ్లకండి అంటూ సూచించడం గమనార్హం. ఇప్పుడు ఆ బీజేపీ నేత చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతన్నాయి.

కేరళ అసెంబ్లీ ఎన్నికలు వాడీ వేడిగా సాగుతున్నాయి. త్వరలో ఎన్నిక జరగనుండగా.. రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారానాలను హోరెత్తిస్తున్నారు. ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. తాజాగా.. ప్రధాని నరంద్ర మోదీ కేరళలో తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బీజేపీ నేత ఒకరు రాహుల్ గాంధీపై వివాదాస్పద కామెంట్స్ చేయడం గమనార్హం.

Scroll to load tweet…

రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదని.. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని.. అతని దగ్గరకు వెళ్లకండి అంటూ సూచించడం గమనార్హం. ఇప్పుడు ఆ బీజేపీ నేత చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతన్నాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఓ సభలో మాజీ ఎంపీ జోయెస్‌ జార్జ్‌ ఆయన మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. ‘‘రాహుల్‌ గాంధీకి అసలే పెళ్లి కాలేదు. అతడి వద్దకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహుల్‌ కార్యక్రమాలన్నీ మహిళల విద్యాలయాల్లోనే జరుగుతాయి. అక్కడకు వెళ్లి రాహుల్‌ అమ్మాయిలకు ఎలా వంగాలి?, ఎలా నిలబడాలి? అని నేర్పుతాడు. అందుకే నా ప్రియమైన అమ్మాయిలు రాహుల్‌ వద్దకు వెళ్లి ఇలాంటి పనులు చేయవద్దు. అతడికి పెళ్లి కాలేదు’ అని జోయెస్‌ జార్జ్‌ పేర్కొన్నాడు.

Scroll to load tweet…

రాహుల్‌ గాంధీ.. సోమవారం కేరళ ప్రచారంలో పాల్గొన్నారు. కొచ్చిలో ఏర్పాటుచేసిన సభలో కొంతమంది అమ్మాయిలకు రాహుల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మెలకువలను స్వయంగా నేర్పారు. దీన్నిటార్గెట్‌ చేస్తూ జోయెస్‌ జార్జ్‌ మాట్లాడటంపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధులు ధర్నా చేపట్టారు. జోయెస్‌ జార్జ్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.