కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) నేతృత్వంలోని ప్రభుత్వంపై సంఘ్ నియంత్రణ లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) తెలిపారు. భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటేనని అన్నారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) నేతృత్వంలోని ప్రభుత్వంపై సంఘ్ నియంత్రణ లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) తెలిపారు. భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటేనని అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో (Dharamshala) మాజీ సైనికుల కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ పాల్గొన్నారు. తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌, మరో 12 మంది సాయుధ బలగాల సిబ్బంది మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. వారికి సంతాప సూచకంగా ఒక నిమిషం మౌనం పాటించారు. ఇక, శనివారం సాయంత్రం జరిగిన ఆ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మంది మాజీ సైనికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ్‌ గురించి మరింత తెలుసుకోవాలిన మోహన్ భగవత్ వారిని కోరారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వారికి వేర్వేరు కార్యనిర్వాహకులు, విభిన్న విధానాలు, విభిన్న పని పద్ధతులు ఉన్నాయి. ఆలోచనలు, సంస్కృతి సంఘ్‌కు చెందినవి.. అది ప్రభావవంతంగా ఉంటుంది. ప్రధాన వ్యక్తులు ప్రభుత్వంలో పని చేస్తున్నారు. మీడియా మమ్మల్ని కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నామని చెబుతుంది. కానీ అది అవాస్తవం. అయితే.. మా కార్మికుల్లో కొందరు ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగమే. మా స్వయం సేవకులకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వదు. ప్రభుత్వం నుంచి మాకు ఏమి అందుతుందని ప్రజలు అడుగుతున్నారు. వారికి నా సమాధానం ఏమిటంటే.. మేం కలిగి ఉన్న దానిని కూడా మనం కోల్పోవలసి రావచ్చు’ అని అన్నారు. 

‘ప్రభుత్వాలు మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాయి. సంఘ్ 96 ఏళ్లుగా అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతుంది. చాలా మంది వాలంటీర్లు సమాజసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సమాజంలో పని చేయాల్సిన అవసరం ఉన్న చోట.. వారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. స్వయంసేవకులు స్వతంత్రులు మరియు స్వయంప్రతిపత్తి కలిగి ఉన్నారని రుజువు చేస్తున్నారు. ఎలాంటి ప్రచారం, ఆర్థిక వనరులు, ప్రభుత్వ సహాయం లేకున్నా సంఘ్ నిరంతరం సమాజం కోసం పనిచేస్తోంది’ అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. 

Scroll to load tweet…

భారతీయులందరి డీఎన్‌ఏ (DNA Of All People In India) ఒక్కటేనని మోహన్ భగవత్ అన్నారు. ‘40 వేల ఏళ్ల కిందటి నుంచి దేశ ప్రజలందరి డీఎన్‌ఏ.. ఇప్పటి ప్రజలది ఒక్కటే. నేను గాలి మాటలు చెప్పడం లేదు. మనందరి పూర్వీకులు ఒక్కటే. పూర్వీకుల కారణంగానే మన దేశం అభివృద్ది చెందింది. మన సంస్కృతి కొనసాగింది’ అని అన్నారు.