కరుణానిధి అంత్యక్రియల్లో వివాదం.. మద్రాస్ హైకోర్టులో డీఎంకే పిటిషన్

DMK petition for Marina Beach burial
Highlights

అనారోగ్యంతో మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియల్లో వివాదం నెలకొంది. కరుణ అంత్యక్రియలను మెరీనాబీచ్‌లోని అన్నాస్క్కేర్ వద్ద నిర్వహించాలని కలైంజర్ కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు

అనారోగ్యంతో మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియల్లో వివాదం నెలకొంది. కరుణ అంత్యక్రియలను మెరీనాబీచ్‌లోని అన్నాస్క్కేర్ వద్ద నిర్వహించాలని కలైంజర్ కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.. అయితే అందుకు తమిళనాడు ప్రభుత్వం అంగీకరించలేదు.

మెరీనా బీచ్‌లోని స్మారక స్థూపాలపై కోర్టు కేసులు ఉన్నాయని సర్కార్ వాదన.. ఇందుకు ప్రతీగా గాంధీ మండపం వద్ద రెండు ఎకరాలు కేటాయించింది. దీనిపై కరుణానిధి కుటుంబసభ్యులు, డీఎంకే కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఎట్టి పరిస్థితిల్లోనూ తమ అభిమాన నేత అంత్యక్రియలు మెరీనాబీచ్ వద్దే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. డీఎంకే అభిమానులు, కార్యకర్తలు కావేరి ఆస్పత్రి వద్దా, గోపాలపురంలోని కరుణానిధి ఇంటి వద్దా ధర్నాకు దిగారు.

మరోవైపు ఈ వ్యవహారంపై డీఎంకే న్యాయపోరాటానికి దిగింది.. మెరీనాబీచ్ వద్ద కరుణానిధి అంత్యక్రియలకు స్థలం కేటాయించాలంటూ డీఎంకే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు రాత్రి 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి. రమేశ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.
 

loader