గుండెపోటుతో డీఎంకే ఎంపీ ఎ.గణేశమూర్తి మృతి..
తమిళనాడుకు చెందిన ఎండీఎంకే ఎంపీ ఎ.గణేశమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన కొద్ది రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఆయన మరణించడం ఎండీఎంకే వర్గాల్లో విషాదం నింపింది.
కొద్ది రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మరుమర్చి డీఎంకే ఎంపీ ఎ.గణేశమూర్తి గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5 గంటల సమయంలో 76 ఏళ్ల నేత కన్నుమూశారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో ఈరోడ్ నుంచి ఎండీఎంకే తరఫున గెలుపొందిన గణేశమూర్తి.. మార్చి 24న అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఈరోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం ఆయనను ఐసీయూలో చేర్చి వెంటిలేటర్ పై ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
తరువాత తాను పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం అంబులెన్స్ లో ఇద్దరు వైద్యులు, కుటుంబ సభ్యులు కలిసి గణమూర్తిని కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన మరణించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఈరోడ్ కు 15 కిలోమీటర్ల దూరంలోని కుమారవలసు గ్రామానికి తీసుకెళ్లి ఖననం చేయనున్నట్లు ఎండీఎంకే వర్గాలు తెలిపాయి. కాగా.. గతంలో ఎ.గణేశమూర్తి 1998లో పళని నుంచి, 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.