నాన్న కోలుకొంటున్నారు ఆందోళన వద్దు: స్టాలిన్

DMK chief responding to treatment, says son MK Stalin; urges cadre to not indulge in violence
Highlights

కావేరీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న డీఎంకె చీఫ్ కరుణానిధిని  సీఎం పళనిస్వామి, డీప్యూటీ సీఎం  పన్నీర్ సెల్వం సోమవారం నాడు పరామర్శించారు. ఆదివారం నాడు అర్ధరాత్రి పూట  కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరీ ఆసుపత్రి యాజమాన్యం  హెల్త్ బులెటిన్ విడుదల చేసింది

చెన్నై: కావేరీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న డీఎంకె చీఫ్ కరుణానిధిని  సీఎం పళనిస్వామి, డీప్యూటీ సీఎం  పన్నీర్ సెల్వం సోమవారం నాడు పరామర్శించారు. ఆదివారం నాడు అర్ధరాత్రి పూట  కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరీ ఆసుపత్రి యాజమాన్యం  హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అయితే ఈ బులెటిన్  ప్రకారంగా కరుణానిధి వైద్య చికిత్స కు సహకరిస్తున్నట్టు ప్రకటించింది.  

అయితే కరుణానిధి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో  వదంతలు రావడంతో  డీఎంకె కార్యకర్తలు పెద్ద ఎత్తున కావేరీ ఆసుపత్రి వద్దకు చేరుకొంటున్నారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు కూడ చేరుకొన్నారు.

ఈ తరుణంలో డీఎంకె కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని  ఆ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్  ఎంకె స్టాలిన్  ప్రకటించారు.  తన తండ్రి కరుణానిధి కోలుకొంటున్నారని స్టాలిన్  చెప్పారు.  వైద్య చికిత్సకు కరుణానిధి స్పందిస్తున్నారని ఆయన ప్రకటించారు. 

కారకర్తలు ఆందోళన చెందకూడదని  స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఎవరూ కూడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడని స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

సేలం పర్యటనలో  ఉన్న తమిళనాడు సీఎం  పళనిస్వామి తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన చెన్నైకు చేరుకొన్నారు.  సోమవారం నాడు ఉదయంపూట  డీప్యూటీ సీఎం పన్నీరు సెల్వంతో కలిసి పళనిస్వామి కావేరీ ఆసుపత్రిలో కరుణానిధిని  పరామర్శించారు.

loader