చెన్నై: తమిళనాడులో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న  డీఎంకె చీఫ్ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధి పూర్వీకులు తెలుగువారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలుకు చెందినవారుగా చెబుతారు. 

తమిళనాడు మూడో సీఎంగా బాద్యతలు నిర్వర్తించిన కరుణానిధి అసలు పేరు దక్షిణమూర్తి. ఆయన 1924 జూన్ మూడో తేదీన ముత్తువేలు, అంజూ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులు తెలుగు వారు కావడంతో దక్షిణమూర్తి అని పేరు పెట్టారు. 

తమిళనాడు కేంద్రంగా రాజకీయాలు నెరపుతున్న ద్రవిడ మున్నేట కజగం (డీఎంకే) అధ్యక్షుడిగా ఉన్న కరుణానిధి తొలిసారి 1969లో సీఎంగా, 2006లో చివరిసారిగా సీఎం అయ్యారు. రాజకీయ రంగంలోనే కాదు తమిళ సినీ రంగంలోనూ కరుణానిధి పాత్ర ఎనలేనిది. 

స్క్రిప్టు, పాటలు, డైలాగుల రచయితగా పేరొందారు. ‘థోకూ మెడాయి’ అనే కళారూపాన్ని వీనుల విందుగా ప్రదర్శించినందుకు కరుణానిధి.. కళైంగర్ అని బిరుదు అందుకున్నారు. ఇప్పటికీ ఆయన అభిమానులు, డీఎంకే నేతలు, శ్రేణులు ముద్గుగా కరుణానిధిని ‘కళైంగర్’ అని ముద్దుగా పిలుచుకుంటారు.