వదంతులు నమ్మొద్దు... కరుణానిధి బాగానే ఉన్నారు:కావేరి ఆసుపత్రి

First Published 29, Jul 2018, 10:30 PM IST
DMK Chief karunanidhi health better now.. says kauvery hospital
Highlights

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషయంలో వస్తున్న వదంతులను నమ్మొద్దంటూ కావేరి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషయంలో వస్తున్న వదంతులను నమ్మొద్దంటూ కావేరి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన బాగానే ఉన్నారని.. వైద్యానికి సహకరిస్తున్నారని వైద్యులు తెలిపారు.

కరుణానిధి భార్య రాజాత్తీ అమ్మాళ్ ఇతర కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిదన్న వార్తల నేపథ్యంలో కావేరి ఆసుపత్రి వద్దకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు  భారీగా చేరుకుంటున్నారు.. వారిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. చెన్నై నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం రావడంతో తమిళనాడు సీఎం పళనిస్వామి తన సేలం పర్యటనను రద్దు చేసుకుని చెన్నై బయలుదేరారు.

loader