కరుణానిధికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

DMK chief Karunanidhi admitted to hospital
Highlights

శస్త్ర చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబసభ్యులు ఈ రోజు ఆస్పత్రిలో చేర్పించారు.

డీఎంకే అధినేత కరుణానిధి బుధవారం ఉదయం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా.. శస్త్ర చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబసభ్యులు ఈ రోజు ఆస్పత్రిలో చేర్పించారు.

గత కొంతకాలంగా కరుణానిధి గొంతు, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన కరుణానిధిని చూసేందుకు ఆయన అభిమానులు కావేరీ ఆసుపత్రికి తరలివెళుతున్నారు. కరుణానిధి ఆరోగ్యం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

loader