కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కే సీఎం పదవిని కట్టబెట్టాలని కోరుతూ డీకే శివకుమార్ అనుచరులు ఆందోళనకు దిగారు.
న్యూఢిల్లీ: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అనుచరులు బుధవారంనాడు న్యూఢిల్లీలో నిరసనకు దిగారు. కర్ణాటక సీఎం పదవిని డీకే శివకుమార్ కు కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. డీకే శివకుమార్ కు మద్దతుగా ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అని ఆయన అనుచరులు తెలిపారు. డీకే శివకుమార్ కు మద్దతుగా ఆయన అనుచరులు ప్ల కార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. దత్తపుత్రుడు కావాలా, అసలు పుత్రుడు కావాలా అంటూ ప్లకార్డులు పట్టుకుని సోనియాగాంధీ నివాసం ముందు డీకే శివకుమార్ అనుచరులు నినారాలు చేశారు.
alsoకర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్: రేపే ప్రమాణం ? read:
కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య అభ్యర్ధిత్వం వైపే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టనుంది కాంగ్రెస్ నాయకత్వంకాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తో డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ లు ఇవాళ గంటన్నరపాటు సమావేశమయ్యారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 135 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేశామనే విషయమై ఆ పార్టీ నాయకత్వం ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
