ట్రిపుల్ తలాక్ నిషేధంపై కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ నిందించారు. అన్ని మతాల్లో విడాకులను సివిల్ కేసులుగా చూస్తున్నప్పుడు ముస్లింలకు మాత్రమే ఎందుకు క్రిమినల్ నేరంగా పరిగణిస్తున్నారని ప్రశ్నించారు.
అన్ని మతాల్లో విడాకులు జరుగుతున్నప్పుడు ముస్లిం మతంలోని ట్రిపుల్ తలాక్ ను మాత్రమే ఎందుకు నేరంగా పరిగణించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణిస్తోందని, ఇతర మతాల విడాకులను సివిల్ కేసులుగా చూస్తున్నప్పుడు ముస్లింలకు మాత్రమే ఎందుకు క్రిమినల్ నేరంగా పరిగణిస్తున్నారని తెలిపారు.
బస్సులో రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకు వెళ్లిన ప్రయాణికుడు.. తీర్పు ఏమిచ్చారంటే..
కేరళలో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఏ పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని సీఎం పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై దేశ ఉపరాష్ట్రపతి, న్యాయశాఖ మంత్రి దాడికి పాల్పడ్డారని విమర్శించారు. “ వివిధ మత నేపథ్యాల నుండి ప్రజలు సమావేశానికి ఇక్కడకు వచ్చి ఉండవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన శిక్షను ఉపయోగించవచ్చా? ఒక నిర్దిష్ట మతాన్ని అనుసరించే వ్యక్తికి ఒక చట్టం, మరొకరికి మరో చట్టం ఉంది. ట్రిపుల్ తలాక్ విషయంలో మనం చూస్తున్నది ఇదే కదా? ’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
“ట్రిపుల్ తలాక్ నేరంగా పరిగణిస్తున్నారు. విడాకులు అన్ని మతాలలో జరుగుతాయి. మిగతావన్నీ సివిల్ కేసులుగానే పరిగణిస్తారు. కేవలం ముస్లింలకు మాత్రమే ఎందుకు నేరం? విడాకుల విషయంలో ముస్లింలకు జైలు శిక్ష విధించవచ్చు. మనమంతా భారతీయులం. ఫలానా మతంలో పుట్టినందుకే మనకు పౌరసత్వం వచ్చిందని చెప్పగలమా? పౌరసత్వానికి మతం ఎప్పుడైనా ప్రాతిపదికగా ఉందా? ’’ అని ఆయన ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పౌరసత్వాన్ని నిర్ణయించడానికి కేంద్రం మతాన్ని ఉపయోగిస్తోందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ సీఎం అన్నారు. ఈ విషయంలో తమ వైఖరిని ఇది వరకే స్పష్టం చేశామని తెలిపారు.
డ్రగ్స్ విషయంలో గొడవ.. ప్రియురాలి దారుణ హత్య.. ఢిల్లీలో ఘటన
మన రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలపై మన పార్లమెంటు నిర్ణయం తీసుకోదని కేరళ సీఎం పినరయ్ విజయన్ అన్నారు. “కేశవానంద భారతి కేసులో 13 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక మైలురాయి తీర్పును ప్రకటించింది. తీర్పు తమ ఎజెండాకు అనుకూలంగా లేదని సంఘ్ పరివార్‌కు తెలుసు. అందుకే సంఘ్ పరివార్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా గళం విప్పింది. ఉపరాష్ట్రపతి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి అయినప్పటికీ కేశవానంద భారతి కేసులో తీర్పును ఖండిస్తూనే ఉన్నారు. న్యాయశాఖ మంత్రి కూడా తరచూ సుప్రీంకోర్టును విమర్శిస్తారు” అని సీఎం అన్నారు.
పదకొండేళ్ల చిన్నారి సాహసం... నీటిలో మునిగిపోతున్న అత్తను కాపాడింది.. కానీ తల్లీ, తమ్ముడు జలసమాధి..
ట్రిపుల్ తలాక్ అంటే ?
‘‘తలాక్ తలాక్ తలాక్’’ అనే పదాన్ని ఉచ్ఛరించడం ద్వారా ముస్లిం భర్తలు తక్షణమే తిరుగులేని రీతిలో తమ భార్యలకు విడాకులు ఇచ్చే పద్దతిని ట్రిపుల్ తలాక్ అంటారు. అయితే ఈ పద్దతిని 2017లో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఆ మరుసటి ఏడాది ట్రిపుల్ తలాక్ చెల్లదని, చట్టవిరుద్ధమని ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) ఆర్డినెన్స్ 2018ను రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో ట్రిపుల్ తలాక్ నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ నేరంగా మారింది. ట్రిపుల్ తలాక్ ను ఉపయోగిస్తే జరిమానా, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.
