సాగర్ జిల్లా మజ్‌గవాన్ గ్రామంలో శుక్రవారం బావిలో జారిపడి ఓ మహిళ మృతి చెందింది. శనివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 

భోపాల్ : తన బంధువు deathతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆమె మండుతున్న చితిలో దూకి suicide చేసుకున్న ఘటన madhyapradeshలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, అతను చితిలో కాలుతున్న ఆమె శరీరం ముందు వంగి దండం పెట్టి, ఆ తర్వాత దారుణమైన చర్యకు పాల్పడ్డాడు. శుక్రవారం సాగర్‌ జిల్లా మజ్‌గవాన్‌ గ్రామంలో జ్యోతి దగా అనే మహిళ బావిలో పడి మృతి చెందింది. శనివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. చితికి మంట అంటించిన అనంతరం బంధువులు అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. 

కొంతసేపటికి జ్యోతి బంధువు కరణ్ అనే యువకుడు శ్మశాన వాటికకు చేరుకున్నాడు. అది మామూలే కదా అనుకున్నారు మొదట అక్కడున్నవారు. కానీ అతని చర్యలు అనేక సందేహాలకు తావిచ్చింది. దీంతో అతడిని చూసి అనుమానించిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. వారు ఆపేలోపే ఆలస్యం అయిపోయింది.

కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే 21 ఏళ్ల యువకుడు తీవ్రంగా కాలిపోయాడు. వారు అదిగమనించి వెంటనే అతడిని చితినుంచి బైటికి లాగి.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని మజ్‌గవాన్ గ్రామ సర్పంచ్ భరత్ సింగ్ ఘోసి తెలిపారు. ఆదివారం ఉదయం జ్యోతి చితి దగ్గరే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అతను అతా చనిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసుల విచారణ తర్వాతే విషయాలు తెలుస్తాయని బహేరియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దివ్య ప్రకాష్ త్రిపాఠి తెలిపారు.

దారుణం.. చెరుకుతోటలో యువతి హత్య.. యాసిడ్ పోసి, ముక్కలుగా నరికి..

కాగా, మహిళల భద్రతపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక రూపంలో అఘాయిత్యం జరుగుతూనే ఉంది. అత్యంత దారుణమైన, పైశాచిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ అఘాయిత్యాలు వినేందుకు అత్యంత జుగుప్సకరంగా, భయాన్ని రేకెత్తించేలా ఉంటున్నాయి. అచ్చం అలాంటి భయానకమైన ఘటనే uttarpradesh లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లో ఓ 18 ఏళ్ల యువతి జూన్ 6న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా missing caseగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే సదరు మహిళ చెరుకు తోటలో శవమై కనిపించింది. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఆమెను murder చేయడానికి ముందు అత్యాచారం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులు ఆమెను హత్య చేసి గుర్తు పట్టకుండా ఉండేందుకు యాసిడ్ పోసి, ముక్కలుగా చేసి చెరుకుతోటలో పడేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని సంతోష్ వర్మగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.