ఉత్తరప్రదేశ్ లో కనిపించకుండా పోయిన ఓ యువతి చెరుకుతోటలో శవమై తేలింది. ఆమెను హత్య చేసిన తరువాత యాసిడ్ పోసి ముక్కలుగా నరికారు నిందితులు. 

ఉత్తర ప్రదేశ్ : మహిళల భద్రతపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక రూపంలో అఘాయిత్యం జరుగుతూనే ఉంది. అత్యంత దారుణమైన, పైశాచిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ అఘాయిత్యాలు వినేందుకు అత్యంత జుగుప్సకరంగా, భయాన్ని రేకెత్తించేలా ఉంటున్నాయి. అచ్చం అలాంటి భయానకమైన ఘటనే uttarpradesh లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లో ఓ 18 ఏళ్ల యువతి జూన్ 6న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా missing caseగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే సదరు మహిళ చెరుకు తోటలో శవమై కనిపించింది. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఆమెను murder చేయడానికి ముందు అత్యాచారం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులు ఆమెను హత్య చేసి గుర్తు పట్టకుండా ఉండేందుకు యాసిడ్ పోసి, ముక్కలుగా చేసి చెరుకుతోటలో పడేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని సంతోష్ వర్మగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఇలాంటి ఘటనే,మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి కలకలం రేగింది. Madhya Pradeshలోని భోపాల్ లో దారుణం చోటుచేసుకుంది. Sexual harassmentను ప్రతిఘటించిన ఓ మహిళపై నిందితులు Paper cutterతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయింది. Surgery క్రమంలో ఆమె ముఖంపై 118 కుట్లు పడ్డాయని స్థానిక పోలీసులు తెలిపారు. 

వివరాల్లోకి వెడితే.. ఆదివారం వారు కేసు వివరాలను వెల్లడించారు. ఆ మహిళ శుక్రవారం తన భర్తతో కలిసి స్థానిక హోటల్ కు వెళ్లింది. బైక్ పార్కింగ్ విషయంలో అక్కడ ఆమెకు ముగ్గురు వ్యక్తులతో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో భర్త హోటల్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే వారు ఆమె పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అమర్యాదకరంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ వారిని ధైర్యంగా ఎదిరించింది. ముగ్గురిలో ఒకరిని చెంపదెబ్బ కొట్టింది అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ దంపతులు హోటల్ నుంచి బయటకు రాగానే... అప్పటికే ఆగ్రహంతో ఉన్న నిందితుడు పేపర్ కట్టర్ తో ఆమెపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో ఆమె ముఖంపై 118 కుట్లు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు.. బాద్షా బేగ్, అజయ్ అలియాస్ బిట్టి సిబ్దేలను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. మూడో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం బాధితురాలు ఇంటికి చేరుకుని పరామర్శించారు, ఆమె వైద్యానికి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళ ధైర్యాన్ని ప్రశంసిస్తూ రూ. లక్ష సాయం అందజేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.