ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మిజోరంల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అసోం ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా.. ఆ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామంలో మిజోరం అధికారులు కోవిడ్ 19 పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

అయితే స్థానికుల కథనం మాత్రం మరోలా వుంది. మిజోరంకు చెందిన పలువురు గ్రామస్తులు లైలాపూర్ గ్రామానికి వచ్చి.. ట్రక్ డ్రైవర్‌పై దాడి చేశారని.. అంతేకాకుండా 15 దుకాణాలు, ఇళ్లకు నిప్పు పెట్టి కాల్చేశారని ఆరోపిస్తున్నారు.

దీనికి స్థానికులు కూడా ప్రతీకార దాడులకు తెగబడ్డారు. మరోవైపు ఘర్షణలను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసుల మీద కూడా రాళ్లు రువ్వారు ప్రజలు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.