Asianet News TeluguAsianet News Telugu

ముస్లిం మహిళలను ఎన్నికల్లో దింపేవారు ఇస్లాంకు వ్యతిరేకం -జామా మసీదు ప్రధాన మతాధికారి షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ

గుజరాత్ అసెంబ్లీకి నిర్వహిస్తున్న రెండో దశ ఎన్నికలకు ముందు అహ్మదాబాద్ లోని జామా మసీదు ప్రధాన మతాధికారి షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలను ఎన్నికల్లో పోటీకి దించేవారు ఇస్లాంకు వ్యతిరేకమని అన్నారు. తమ మతంలో మహిళకు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. 

Dismissing Muslim women in elections is against Islam - Jama Masjid chief cleric Shabbir Ahmed Siddiqui
Author
First Published Dec 5, 2022, 9:06 AM IST

ముస్లిం మహిళలను ఎన్నికల బరిలోకి దింపేవారు ఇస్లాంకు వ్యతిరేకమని, వారు మతాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అహ్మదాబాద్‌లోని జామా మసీదు ప్రధాన మతాధికారి షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ అన్నారు. గుజారాత్ రాష్ట్రంలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇస్లాం మంతంలో ప్రార్థన కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. కానీ ఎక్కడైనా స్త్రీ నమాజ్ చేయడం చూశారా ? ఇస్లాంలో స్త్రీలు అందరి ముందు బయటకు రావటం అనుమతి ఉంటే.. వారిని ఎవరూ అడ్డుకునేవారు కాదు.” అని ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.

విచిత్రం.. అక్కడ ఎటు చూసినా ద్రౌపదులే.. ఒక్కొక్క మహిళకు ఐదుగురు, అంతకుమించి భర్తలు...ఎక్కడంటే..

అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ ఇస్లాంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే వారిని ప్రార్థనలు చేయడానికి మసీదులకు రాకుండా నిషేధం ఉంది. అందుకే ముస్లిం మహిళలకు ఎన్నికల టిక్కెట్లు ఇచ్చే వారు ఇస్లాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారే అవుతారు’’ అని అన్నారు. 

కర్నాటకలో జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. “ మీరు ఆడవాళ్ళని తీసుకువస్తున్నారు. ఇది మన మతాన్నిబలహీనపరుస్తుంది. అది ఎలా బలహీనపరుస్తుందంటే ? మీరు మీ మహిళలను ఎమ్మెల్యేలను, ర్పొరేటర్‌లను చేస్తే మనం హిజాబ్‌ను రక్షించుకోలేము.’’ అని అన్నారు.  తన ప్రకటనలలోని కఠోరమైన లింగవివక్షను పూర్తిగా విస్మరించి ఆయన నవ్వుతూ ‘‘ఎన్నికల్లో పోటీ చేస్తే.. హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఇంటింటికి వెళ్లాలి. కాబట్టి నేను దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీరు కావాలంటే పురుషులకు ఎన్నికల టిక్కెట్లు ఇవ్వవచ్చు.’’ అని అన్నారు. 

కూల్ డ్రింక్ లో సైనెడ్ కలిపి భర్త హత్య.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య ఘాతుకం..

మహిళలకు ఎందుకు టికెట్ ఇస్తున్నారనే విషయంలో సిద్దిఖీ తన మాట్లాడుతూ.. “ఈ రోజుల్లో అనేక విషయాల్లో మహిళ పాత్ర ఎక్కువగా ఉంది. కాబట్టి వారిని కలుపుకుంటే కుటుంబం మొత్తం పాల్గొంటుంది. ఇంతకు మించి మహిళకు టిక్కెట్లు ఇవ్వడానికి వారి వేరే కారణం కనిపించడం లేదు.’’ అని ఆయన అన్నారు. గుజరాత్‌లో 93 నియోజకవర్గాల ఎన్నికలకు ఒక రోజు ముందు మత గురువు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదే సరైన సమయం.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను వెనక్కి తీసుకోవాలి

కాగా.. గుజరాత్ లో రెండో దశ ఎన్నికలలో అధికార బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. రాష్ట్రంలోని దాదాపు 64 మిలియన్ల జనాభాలో ముస్లింలు 10 శాతం ఉన్నారు. అయితే ముస్లిం మహిళలకు శాసనసభలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios