Asianet News TeluguAsianet News Telugu

అవిశ్వాసంపై చర్చకు తేదీలివే: లోక్‌సభలో 20న, రాజ్యసభలో 23న

కేంద్రంపై  టీడీపీ ప్రతిపాదించిన  అవిశ్వాస తీర్మాణంపై  జూలై 20వ తేదీన లోక్‌సభలో చర్చ జరగనుంది.  ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి  అవిశ్వాసంపై  చర్చను చేపట్టనున్నారు.

Discussion on No confidence motion to take place on Friday in Lok Sabha and Monday in Rajya Sabha

న్యూఢిల్లీ: కేంద్రంపై  టీడీపీ ప్రతిపాదించిన  అవిశ్వాస తీర్మాణంపై  జూలై 20వ తేదీన లోక్‌సభలో చర్చ జరగనుంది.  ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి  అవిశ్వాసంపై  చర్చను చేపట్టనున్నారు. రాజ్యసభలో  అవిశ్వాస తీర్మాణంపై జూలై 23న చర్చ చేపట్టనున్నారు.

కేంద్రంపై  టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు  అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాయి. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్‌తో  టీడీపీ నేతలు కేంద్రంపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు. ఇతర డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు కూడ అవిశ్వాసం కోసం ముందుకు వచ్చాయి.

అవిశ్వాసంపై  ఒక్క రోజు చర్చ చేపట్టేందుకు  సమయాన్ని కేటాయించినట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.  జూలై  20వ తేదీన  అవిశ్వాసంపై చర్చ నిర్వహించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి  అవిశ్వాసంపై చర్చను చేపట్టనున్నారు.

ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ సమయాన్ని కేటాయించారు. అయితే ఏ పార్టీకి ఎన్ని గంటల పాటు సమయాన్ని కేటాయించనున్నారో కూడ ప్రకటించనున్నారు.  

ఇదిలా ఉంటే  రాజ్యసభలో  జూలై23వ తేదీన అవిశ్వాసంపై చర్చ జరగనుంది.  బీఏసీ సమావేశంలో అవిశ్వాసంపై చర్చ జరిగే తేదీని ఈ మేరకు నిర్ణయించారు.  అవిశ్వాసం  సందర్భంగా  ఏపీకి జరిగిన అన్యాయాన్ని, బీజేపీ ఇచ్చిన హమీలను  అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని  వివరించాలని  టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు.మరోవైపు నాలుగేళ్లపాటు కేంద్రం నుండి ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన నిధులను అంకెలతో సహా ప్రకటించనున్నట్టు బీజేపీ నేతలు సిద్దంగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios